పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టిన సమయంలో సభా విదికపై మాట్లాడుతూ, నేను ఈ పార్టీ పెట్టింది ఎన్నికల్లో పోటీ చేయడానికో లేదా అధికార పార్టీ ఎన్నికలను చీల్చడానికో, లేదా రాజకీయాల్లోకి వచ్చి తెగ డబ్బూ సంపాదించుకోవడానికో కాదు, కేవలం ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికే. రైతులకు సామాస్య ప్రజానికానికి ఎక్కడ అన్యాయం జరిగితే నేను అక్కడ ఉంటానని పవన్ ఆ సందర్భంలో పలికిన వాఖ్యలు అందరికీ విదితమే. అయితే, పవన్ చెప్పిన మాటలకూ చేసే పనులకు పొంతన కనబడటం లేదు. ఇటీవల కాలంలో పవన్ ప్రవర్తనపై ప్రజల్లో. నేతల్లో సైతం భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

 

పవన్ ఎప్పుడో ఒకసారి మీడియా ముందుకు వచ్చి నాలుగు మాటలు మాట్లాడి వెళ్ళడం తప్పించి, సామాజిక అనుసంధాన వేదికలో ట్వీట్ లూ తప్పించి, ఆయనవల్ల తెలుగు ప్రజలకు ఒరిగిందేమీ లేదని కొందరు విమర్శిస్తున్నారు. పైగా ఎన్నికల్లో పాల్గొనని చెప్పి వచ్చే ఎనికల్లో పోటీకి సై అని ప్రకటించాడం పట్ల  ప్రజలు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని, వారికి అండగా నిలబడి ప్రశ్నిస్తానని ఆయన వెల్లడించిన విషయం అందరికీ విదితమే.


మా భూముల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని కోసం బ‌ల‌వంతంగా లాక్కుంటున్నారు. భూములు ఇవ్వమని ఎన్ని సార్లు చెప్పినా తమను భయపెట్టడానికి ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చింది. మూడు పంటలు పండే భూములను కాపాడుకునేందుకు పోరాడుతున్నాం. బ్యాంకులు రుణాలు ఇవ్వ‌డం లేదు. స‌బ్సిడీలు ఆపేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ రా ప్ర‌శ్నించు అని ఆంధ్రా రాజ‌ధాని స‌మీపంలో ఉన్న ఉండ‌వ‌ల్లి, పెనుమాక గ్రామాల రైతులు త‌మ పొలాల్లో పెద్ద ఎత్తున ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌ళ్యాణ్ ఫ్లెక్సీల‌ను క‌డుతున్నారు.

 

బ‌ల‌వంత‌పు భూ సేక‌ర‌ణ‌ల మీద ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందించాల‌ని రైతులు ఆవేద‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు. సీడ్ క్యాపిట‌ల్ ప‌రిధిలో లేకున్నా భూములు లాక్కుంటున్నార‌ని, ప్రాణాలు పోయినా భూములు ఇవ్వ‌మ‌ని రైతులు చెబుతున్నారు. గ‌తంలో రైతుల త‌ర‌పున పోరాడతాన‌ని ప్ర‌క‌టించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ కేవ‌లం ట్వీట్ల‌కు, మీడియా స‌మావేశాల‌కు ప‌రిమితం అయ్యాడు. మ‌రి ఇప్పుడేం ప్ర‌శ్నిస్తాడో వేచిచూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: