భారత దేశంలో రోజు రోజుకీ రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కట్టుదిట్టమైన ఏర్పాటు చేసినా..రోడ్డు రవాణా సంస్థ ఎన్ని సూచనలు చేసినా ఈ రోడ్డు ప్రమాదాలు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బలరాంపూర్ జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ బస్సు ప్రమాదంలో 17 మంది దుర్మరణం చెందగా, 48 మందికి గాయాలయ్యాయి. వేగంగా వెళుతున్న బస్సు మోటార్ సైకిల్ను తప్పించడానికి ప్రయత్నించగా, అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి పడిపోయింది. జార్ఖండ్లోని గద్వా నుంచి రాయ్పుర్ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

 సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది క్షత్రుగాత్రుల్ని వెంటనే అంబికాపూర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ ప్రమాదంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సహాయక చర్యలు అందించాల్సిందిగా ఆదేశించారు. అలాగే, మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలుపుతూ.. తగిన పరిహారం అందజేయనున్నట్టు తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: