ప్రపంచంలో ఎన్నో వింతలూ విశేషాలు జరుగుతూనే ఉంటాయి..ఒకప్పుడు ఇలాంటి విషయాలు తెలియాంటే చాలా సమయం పట్టేది..కారణం అప్పట్లో ప్రింట్ మీడియానో లేదా టీవిల ద్వారానో తెలిసేవి..కానీ ఇప్పుడు ఫాస్ట్ జనరేషన్. ఎలాంటి విషయమైనా క్షణాల్లో తెలిసిపోతున్నాయి. ప్రపంచంలో జరిగే వింతలూ విశేషాలో సోషల్ మాద్యమాల ద్వారా జనాలకు ఇట్టే తెలిసిపోతున్నాయి. తాజాగా చైనాలోని హునన్ రాష్ట్రంలోని పింగ్‌జాంగ్ జిల్లాలో ఆ అరుదైన చిన్నారి జన్మించాడు. అయితే ఈ బుడ్డోడికి సాధారణ మనిషికి ఉన్న వేళ్ల కంటే అధికంగా ఉండటమే వింత.

సాధారణంగా చేతికి, కాలుకి వెళ్లు ఒకటీ అధనంగా రావడం సహజం కానీ ఈ చిన్నారి మాత్రం చేతులకు 15 వేళ్లు, కాళ్లకు 16 వేళ్లతో జన్మించడం ఆసక్తికరంగా మారింది. ఈ ఏడాది జనవరిలో జన్మించిన చిన్నారి హాంగ్ కాంగ్ 'పాలీ డాక్టలిజమ్' అనే కారణంగా ఇలా అదనపు వేళ్లతో జన్మించినట్టుగా వైద్యులు తెలిపారు.వెయ్యి మంది చిన్నారుల్లో ఒకరికి మాత్రమే ఈ వ్యాధి కనిపించే లక్షణాలున్నాయి.

చేతి వేళ్లు


అయితే ఎక్కువగా వచ్చిన వేళ్లను శస్త్రచికిత్స ద్వారా తొలిగిస్తారు. విచిత్రమేమిటంటే చిన్నారి హాంగ్‌కాంగ్ తల్లి కూడా ఎక్కువ వేళ్లతో జన్మించింది. ఆమెకు కూడా ఆరు వేళ్లు ఉన్నాయి.  చైనాలోని హునన్ రాష్ట్రంలోని పింగ్ జాంగ్ జిల్లాలో జన్మించిన ఈ చిన్నారిని చూడడానికి అక్కడి జనం ఆసక్తి కనబరుస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: