అదేంటి ప్రస్తుతం లీటర్ పెట్రోల్ 68 రూపాయలు కదా, అదేంటి మరి 30 రూ. లీటర్ ఎక్కడ దొరుకుతుందని ఆశ్చర్య పోతున్నారా..? అవును మీరు చదువుతున్నది నిజం. ప్రపంచ దేశాలు మొత్తం ముడి చేమూరు ధరలు తగ్గిస్తే మోడీ ప్రభుత్వం మాత్రం తగ్గించకుండా సామాయుల నడ్డి విరుస్తుందని ఒక వ్యక్తి మోడీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డాడు. ప్రస్తుదేశంలో పెట్రోలు ధరలు సగానికి దిగినా మోడీ ప్రభుత్వం మాత్రం పాత ధరకే పెట్రోల్ విక్రయించడం పట్ల ఆయన తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు.

 

ప్రస్తుతం ప్రపంచ మొత్తంలో ఏ దేశం విధించని విధంగా భారత్ పెట్రోల్ పై అన్ని టాక్సులు విధిస్తుంది. పక్కనున్న పాకిస్థాన్ లో కుడా పెట్రోల్ లీటర్ రూ. 30 కి దొరుకుతుంది. మరి అలాంటిది పాకిస్థాన్ కన్నా ఆర్థికంగా ఉన్న స్థాయిలో ఉన్న భారత్ మాత్రం పెట్రోల్ పై టాక్స్ మాత్రం తగ్గించట్లేదని ఆయన అభిప్రాయ పడ్డారు.  

 

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధర పెంచడాన్ని వ్యతిరేకిస్త్తు ఎన్‌ఎస్‌యూఐ బుధవారం వినూత్నంగా ఆందోళన చేపట్టింది. ఈమేరకు నగరంలోని మౌర్య హోటల్ సర్కిల్‌లోని గూడంగడిలో ఆ సంఘం రాష్ట్రధ్యక్షుడు మంజునాథ్ ఆధ్వర్యంలో నిరసనకారులు రూ.30కే లీటర్ పెట్రోల్ విక్రయించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గినప్పటికి బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ రేట్లను పెంచుతోందని మంజునాథ్ మండిపడ్డారు.  వెంటనే ధరలనుతగ్గించాలని డిమాండ్ చేసారు. ఎన్‌ఎస్‌యూఐకి మద్దతుగా రాజాజీనగర్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ ,నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: