నేటి కొత్త తరం రాజకీయాల్లో రాజకీయ ఎత్తుగడలు అనేది సర్వ సాధారణం. అధికారంలోకి రావడానికి, వచ్చిన అధికారాన్ని నిలుపుకోడానికి పన్నాగాలు పన్నడం లాంటివి నేటి రాజకీయాల్లో సర్వసాధారణం. కొన్ని పార్టీలైతే ప్రత్యక్షంగా, మరికొన్ని పార్టీలైతే పరోక్షకంగా మద్దతు తెలపడం నేటి రాజకీయాల్లో మామూలే. నేటి రాజకీయాల్లో రాజకీయ ఎత్తులు, పన్నాగాలను మనం చూస్తూనే ఉంటాం. త్వరలో జరగబోయే తమిళనాట ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి పావులు కదుపుతోంది.

 

మళ్ళీ అధికారంలోకి రావడానికి జయ కొత్త వ్యూహాలను రచిస్తోంది. మొదటినుంచీ జయకి , బీజేపీ పార్టీకి ఉన్న సాన్నిహిత్యాన్ని తన అధికారాన్ని నిపులుకోదానికిపావులు కదుపుతోందని జయలలిత. వీరు ఎప్పుడూ కలిసి రాజకీయాల్లో పొత్తు పెట్టుకోనప్పటికీ అవసరాన్ని బట్టి ఒకరికి ఒకరు సహకరించుకోవడం వారికి తెలిసిందే. ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే, హస్తం దోస్తీకి చెక్ పెట్టడానికి గెలుపు వ్యాహాలనుఇ రచిస్తోంది జయ. కేంద్రంలో ఉన బీజేపీకి. జయ కి మధ్య రహస్య ఒప్పందాలు కుదిరాయని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ.

 

అన్నాడీఎంకే - కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మధ్య రహస్యం ఒప్పందం ఉందని ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ ఆరోపించారు. అందుకే కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అన్నాడీఎంకే వ్యతిరేకించడం లేదని మండిపడ్డారు. డీఎంకే-కాంగ్రెస్ కూటమి అభ్యర్థులకు మద్దతుగా చెన్నై, ఐలాండ్ మైదానంలో గురువారం సాయంత్రం బహిరంగ సభ జరిగింది. ఇందులో సోనియాగాంధీ, డీఎంకే అధినేత ఎం కరుణానిధి ఒకే వేదిక మీద నుంచి ప్రసంగించారు. డీఎంకే , కాంగ్రెస్‌లు ప్రజాహితాన్ని కాంక్షించే పార్టీలని, తమ ద్వారానే రాష్ర్ట ప్రగతి సాధ్యం అని కరుణానిధి వ్యాఖ్యానించారు. అంతకుముందు పుదుచ్చేరి ప్రచారంలో సోనియాఅక్కడి ఎన్‌ఆర్ కాంగ్రెస్‌పై విరుచుకు పడ్డారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: