వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే పడిన వర్షం కూడా రివర్స్ లో శత్రువు గా మారింది. అకాల వర్షం కురిసి తెలంగాణా రాష్ట్రం అతలా కుతలం అయిపొయింది ఇప్పుడు. రాజధాని హైదరాబాద్ తో పాటు అనేక జిల్లాలు తెలంగాణా లో ఫుల్ గా తడిసాయి. అయితే ఇది రైతుల మంచి కోసం అన్నట్టు కాకుండా నెగెటివ్ గా అయిపొయింది పరిస్థితి. ఈదురు గాలి తీవ్రంగా వీయడం తో కొన్ని చోట్ల చెట్లు సర్వస్వం నెల కూలిపోయాయి. కూకటి వేళ్ళతో సహా ఉనికి కోల్పోయి రోడ్డు మీద పడ్డాయి. విద్యుత్ స్తంభాలు సైతం నెలకి ఒరిగి రోడ్లు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. కరంట్ కీ , నీరు కీ చాలా ఇబ్బందిగా మారింది వ్యవహారం. ఒకపక్క మంచి నీరు సరఫరా చెయ్యడం కోసం , కమ్యునికేషన్ వ్యవస్థ ని మళ్ళీ పునరుద్దీకరణ చెయ్యడం కోసం వెళ్ళిన సిబ్బంది చాలా అవస్థలు పడ్డారు.


కేవలం గండి పేటలో మాత్రమే ఎనిమిది సెంటిమీటర్ ల వర్షం పడింది అంటే హైదరాబాద్ ఎంతగా తడిసి ముద్ద అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. మహబూబ్ మాన్షన్ మార్కెట్‌లో విక్రయించేందుకు రైతులు తెచ్చిన మిర్చి తడిసి ముద్దయ్యింది. అదృష్ట వస్తాత్తూ ప్రాణ నష్టం జరగకపోవడం మంచి విశేషం. చాలా చోట్ల కరంట్ స్తంభాలూ, చెట్లూ మీద పడి కార్లూ , బైక్ లూ నుజ్జు నుజ్జు అయ్యాయి. ఇది ఇక్కడితో అవ్వలేదు రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రాణనష్టం జరగకుండా వర్షం లిమిటెడ్ గా పడుతూ రైతులకి మేలు చెయ్యాలని కోరుకుందాం .

మరింత సమాచారం తెలుసుకోండి: