గత కొంతకాంగా ఎంతో ఉత్కంఠంగా కొనసాగిన తమిళ రాజకీయాలకు అమ్మ గెలుపుతో చెక్ పడింది.  తమిళ ప్రజలకు ఎంతో ఇష్టమైన వ్యక్తి ఎంజీఆర్ రాజకీయ వారసురాలిగా జయలలిత రాజకీయాలో ఎన్నో మైలు రాళ్లుదాటుతూ మొన్నటి విజయంతో ఆరోసారి ముఖ్యమంత్రి పీఠం తక్కించుకుంది. కాగా నేడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జయలలిత రైతు రుణమాఫీ ఫైలుపై తొలి సంతకం చేశారు. అంతే కాదు ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలు అప్పుడే మొదలు పెట్టారు.. పలు కొత్త పథకాలతో ప్రజలకు అమ్మ వరాల జల్లు కురిపించారు.  

ప్రమాణ స్వీకారం చేస్తున్న ముఖ్యమంత్రి జయలలిత


ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం అల్పాహారం, మద్యం దుకాణాలకు సమయం కుదింపు, వంద యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్, చేనేత కార్మికులకు 700 యూనిట్లు ఉచితంగా విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ కొత్త పథకాలు జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. అంతే కాదు  500 రిటైల్ మద్యం షాపుల మూసివేతకు ఆమె ఆదేశాలు ఇచ్చారు. ఇక జయలలిత సోమవారం ప్రమాణ స్వీకారం చేయగా ఆమె తో పాటు 8 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. గతంలో కొనసాగిన సాంప్రదాయం ప్రకారమే..ఈసారి కూడా చేశారు. అయితే ఈసారి అమ్మ కేబినెట్ లో  13 మంది కొత్తవారికి అవకాశం దక్కింది...వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. ఇక తమిళనాడులో  234 అసెంబ్లీ స్థానాల్లో 232 సీట్లు ఎన్నికలు జరగ్గా, అన్నాడీఎం 134 స్థానాల్లో విజయఢంకా మోగించింది. దీంతో సంపూర్ణ మెజార్టీతో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంది.

గవర్నర్ రోశయ్య, ముఖ్యమంత్రి జయలలిత

Jayalalithaa sworn in as Chief Minister of Tamil Nadu

మంత్రులు వారికి కేటాయించిన శాఖలు :


01. జయలలిత : హోంశాఖ, రెవెన్యూ, జనరల్ అడ్మినిస్ట్రేషన్
02. పన్నీరుసెల్వం : ఆర్థిక శాఖ
03. శ్రీనివాసన్ - అటవీశాఖ
04. ఈదప్పడి కె. పలానీస్వామి - రహదారులు, పబ్లిక్ వర్క్స్
05. సెల్లూర్ కె.రాజు - సహకార మరియు కార్మిక శాఖ
06. తంగమణి - విద్యుత్ మరియు ఎక్సైజ్ శాఖ
07. వీపీ వేలుమణి - గ్రామీణాభివృద్ధి మరియు మున్సిపల్ శాఖ
08. డి.జయకుమార్ - మత్స్యశాఖ
09. శణ్ముగమ్ - న్యాయ, జైళ్ల శాఖ
10. కేపీ అన్‌భజ్‌హగన్ - ఉన్నత విద్య
11. ఆర్‌బీ.ఉదయ్‌కుమార్ - రెవెన్యూ
12. కేటీ.రాజేంత్ర బాలాజీ - గ్రామీణ పరిశ్రమలు
13. కేసీ వీరమణి - వాణిజ్య పన్నుల శాఖ
14. పి.బెంజీమెన్ - పాఠశాల విద్య, ఆటలు మరియు యువజన సంక్షేమం
15. వెల్లమండి ఎన్.నటరాజన్ - పర్యాటక శాఖ
16. ఎస్.వలార్‌మఠి - వెనుకబడిన తరగతులు మరియు మైనార్టీ సంక్షేమ శాఖ
17. వీఎం.రాజలక్ష్మీ - ఆది ద్రవిడర్ మరియు గిరిజన సంక్షేమ శాఖ
18. ఎమ్.మణికందన్ - ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ(ఐటీ)
19. ఎంఆర్.విజయ్‌భాస్కర్ - రవాణా శాఖ.
20. డాక్టర్ వీ.సరోజ - సాంఘీక సంక్షేమ శాఖ
21. కేసీ కరుప్పన్నన్ - పర్యావరణ శాఖ
22. ఎంసీ సంపత్ - పరిశ్రమలు
23. ఆర్.కామరాజ్ - ఆహార, పౌరసరఫరాల శాఖ
24. ఓఎస్ మనేన్ - చేనేత మరియు జౌళి శాఖ
25. ఉడుమలై రాధాకృష్ణన్ - గృహ మరియు పట్టణాభివృద్ధి శాఖ
26. సీ.విజయ్‌భాస్కర్ - ఆరోగ్య శాఖ
27. ఎస్పీ శణ్ముగనాథన్ - పాలు మరియు పాడి పరిశ్రమ అభివృద్ధి
28. ఆర్.దురైకన్ను - వ్యవసాయం మరియు పశు సంరక్షణ శాఖ
29. కదంబూర్ రాజు - సమాచార శాఖ


మరింత సమాచారం తెలుసుకోండి: