తెలుగు రాష్ట్రాలో విడిపోయిన తర్వాత ఒక సంవత్సరం పాటు రాజకీయంగా ఎలాంటి హడావిడి లేకుండా కొనసాగింది..కాకపోతే ఇద్దరు సీఎంల మద్య ఆ మద్య ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సమయంలో ఓటు కు నోటు వ్యవహారం పెద్ద ఇష్యూగా మారింది. తర్వాత రేవంత్ రెడ్డికి బెయిల్ రావడం..కేంద్ర పెద్దలు జోక్యం చేసుకోవడంతో ఈ గొడవకు తెరపడింది. కానీ గత కొంత కాలం నుంచి ఇరు రాష్ట్రాల్లో రాజకీయాల్లో పెను మార్పులు వస్తున్నాయి..ముఖ్యంగా తెలంగాణలో ప్రతిపక్ష హోదాలు ఉన్న టీడీపీ నుంచి దాదాపు అందరూ టీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు. ఇప్పుడు ఇక్కడ ప్రదాన ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రమే మిగిలింది..ఇక ఏపీలో రాజకీయాలు మరోలా ఉన్నాయి..అక్కడ ప్రధాన ప్రతిపక్షాంగా ఉన్న వైసీపీ నుంచి ఒక్కొక్కరూ టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు.

తాజాగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచి, ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరిన జలీల్ ఖాన్ ఓ టీవీ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.   వైయస్ జగన్ గ్రాఫ్ క్రమంగా తగ్గుతోందని చెప్పిన ఆయన.. ఆ కారణంగానే టీడీపీలో చేరానని స్పష్టం చేశారు.  ఒకప్పుడు ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి పై ఉన్న అభిమానంతో అప్పట్లో వైఎస్ జగన్ కి ఏపీ ప్రజలు గౌరవం ఇచ్చారని కానీ ఆ గౌరవం ఆయన కాపాడుకోలేక పోతున్నారని విమర్శించారు.

టీఆర్ఎస్, టీడీపీ


తెలుగు దేశంలోకి వచ్చిన తనకు మంత్రి పదవి రాకున్నా ఇబ్బందేమీ లేదని తేల్చి చెప్పారు. కేవలం మంత్రి పదవి కోసమే తాను టీడీపీలో చేరలేదని కుండబద్దలు కొట్టారు. అంతే కాదు పార్టీ ఫిరాయింపు చేశారని పదే పదే అంటున్న వైఎస్ జగన్ ఆరోపిస్తున్నారని అయితే   వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలిచిన తాను ఆ పదవికి రాజీనామా చేసి తిరిగి గెలిచే సత్తా ఉందని జలీల్ ఖాన్ పేర్కొన్నారు. ఒకవేళ ఉప ఎన్నికలో గెలవలేకపోతే చెప్పులు మెడలో వేసుకుని తిరుగుతానని ఆయన చెప్పారు.

వైసీపీ, టీడీపీ


ఉప ఎన్నికలో తాను గెలిస్తే జగన్.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని మూసేస్తారా? అని జలీల్ ఖాన్ సవాల్ విసిరారు. వైయస్సార్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నట్లు దుర్గ గుడి ఫ్లైఓవర్ కాంట్రాక్టులో తనకు ఎలాంటి సబ్ కాంట్రాక్టులు లేవని ఆయన స్పష్టం చేశారు. ఏపి అభివృద్ధి కోసం చంద్రబాబునాయుడు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. అందుకే ఆ పార్టీ నుంచి టీడీపీలోకి వస్తున్నారని అన్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: