తమిళనాడు ఎన్నికల్లో రెండో సారి భారీ విజయం సాధించిన అన్నా డీఎంకే అధ్యక్షురాలు జయలలిత విజయాన్ని చాలా సంతోషంగా అందరితో పంచుకొని వీరాభిమానాన్ని చాటుకొన్నాడు ఓ ఆటో డ్రైవర్. కోయంబత్తూర్ కు చెందిన ఈ వీరాభిమానికి జయమ్మ అంటే ఎంతో మక్కువ. అలాంటి అమ్మ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఏదో ఒక సహాయం ప్రజలకు చేసి ఈ సంతోషాన్ని పది మందితో పంచుకోవాలని అనుకొన్నాడు. అనుకున్నాడో లేదో తన ఆటో తీసుకొని కేవలం ఒక్క రూపాయికే పాసింజర్లను గమ్య స్థానాలకు చేర్చాడు.


తన ఆటోలో ఎక్కే ప్రయాణీకులు ఎక్కడి నుంచి ఎక్కడి వెళ్లినా వాళ్ల దగ్గర కేవరం రూపాయి మాత్రమే ఆటో ఛార్జీగా తీసుకుంటున్నారు. ఈ విధంగా ఒక్క రోజులో 102 రూపాయలు సంపాదించానని, 102 మందిని వారి గమ్యాలను చేర్చినట్లు ఆ ఆటో డ్రైవర్ ఆర్‌ఎం మత్తివనన్ వెల్లడించారు. ఇందుకోసం ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనాన్ని మానేశానని.. ఉదయం 6 గంటలకు రోడ్డెక్కిన ఆటో సాయంత్రం 6 గంటలకే ఆగుతుందన్నారు.

 

ప్రజల మనసుల్ని గెలుచుకొని సుపరిపాలన నిర్వహిస్తే ప్రజలే నాయకులను ప్రత్యక్ష దైవంలా ఆదరిస్తారని ఈ సంఘటన చూస్తే తెలుస్తుంది. ఒక రాష్ట్ర సుపరిపాలన పట్ల ప్రజలు ఎంత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారో అమ్మ గెలిచినా రోజు అంబరాన్ని అంటిన సంబరాలు చూస్తే తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ తమిళ ప్రజలను తమ బిడ్డల్లా భావించి వారికి ఏలోటు రాకుండా చూసుకుంటానని అమ్మ మీడియా సాక్షిగా ప్రమాణం చేశారు కుడా...!


మరింత సమాచారం తెలుసుకోండి: