నరేంద్రమోడీ ప్రధానిగా రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. గాంధీ కుటుంబానికి చెందని ఓ వ్యక్తి ఆధ్వర్యంలో బీజేపీ పూర్తిస్థాయి మెజారిటీ సాధించి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం నిజంగా రెండేళ్ల క్రితం ఎవరూ ఊహించలేదు. మోడీ సృష్టించిన ఓట్ల సునామీ అది. అంతేకాదు.. నూటపాతిక కోట్ల జనం మోడీపై పెట్టుకున్న ఎన్నో ఆశలకు ఆ ఓట్లు ప్రతిరూపాలు. 

మరి ఆ ఆశలను, ఆకాంక్షలను మోడీ సర్కారు నెరవేర్చిందా.. ప్రజలు మెచ్చేలా మోడీ పాలన సాగుతోందా.. 2014 మే26న ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీ సర్కారులో ప్లస్ పాయింట్లేమిటి. మైనస్ పాయింట్లేమిటి స్థూలంగా పరిశీలిద్దాం.. 

మోడీ పాలన ప్లస్ పాయింట్లు..
1. మోడీ ఏం చేసినా చేయకపోయినా... అవినీతి, కుంభకోణాలు ఈ రెండేళ్లలో లేవు. 
2. మోడీ సర్కారులో బంధుప్రీతి ఆరోపణలు అసలే లేవు. దు.
3. లాబీయిస్టులకు చెక్ పెట్టారు. 
4. అవినీతి బాగా తగ్గిందని అంతర్జాతీయ సర్వేల్లోనూ తేలింది. 
5. అంతర్జాతీయంగా పెరిగిన భారత్ ఖ్యాతి.


మోడీ పాలన 5 మైనస్ పాయింట్లు..   

1. రెట్టింపైన నిత్యావసరాల ధరలు..  

2. అంతర్జాతీయంగా తగ్గిన భారత్ లో తగ్గని చమురు ధరలు.
3. కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగానే ఎక్కువ నిర్ణయాలు.
4. పని తక్కువ ప్రచారం ఎక్కువ అన్న మార్కు వచ్చేసింది.
5. ఉద్యోగులపై పన్నులకు ప్రయత్నాలు, పీఎఫ్ పైనా పన్నులు.

అవినీతిని తుదముట్టించాం. పాలనను గాడిలో పెట్టాం.. అంతర్జాతీయంగా ఖ్యాతి పెంచాం.. అని ప్రచారం చేసుకోవడం ద్వారా ఇంకా మోడీ ప్రజలను ఆకట్టుకోలేరు. వాస్తవంగా ప్రజల జీవితాల్లో ఆ మార్పు కనిపించాలి. దురదృష్టవశాత్తూ అలాంటి ప్రభావం ఇంతవరకూ కనిపించడం లేదు. ఇది మోడీ సర్కారుకు ప్రమాద ఘంటికే. దీన్ని మోడీ సర్కారు పరిగణలోకి తీసుకోకపోతే జనాగ్రహం వెల్లువెత్తడం ఖాయం. 



మరింత సమాచారం తెలుసుకోండి: