ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలైంది. ఎవరి పాలన వారిదే.. ఎవరి కష్టసుఖాలు వాళ్లవే.. ఈ విభజన సమాజంలోని అన్నివర్గాల్లోనూ వచ్చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్న వివిధ వర్గాల వారి మధ్య ఆంధ్ర- తెలంగాణ విభజన కనిపించకుండానే సాగుతోంది. ఇక జర్నలిస్టుల పరిస్థితి మరీ విచిత్రం.

ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రరాజధానిగా ప్రధాన పత్రికలు,ఛానళ్లకు సంబంధించిన పాత్రికేయులు హైదరాబాద్ లోనే ఉండేవారు. సీనియర్లయితే చాలామంది ఇక్కడే స్థిరపడిపోయారు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయేసరికి సొంత జిల్లాల ఆధారంగా ఆంధ్రా, తెలంగాణగా విడిపోతున్నారు. ప్రభుత్వ స్కీమ్ ల కోసం దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. 


తెలంగాణ జర్నలిస్టులకు ఆంధ్రా పథకాలు, ఆంధ్రా జర్నలిస్టులకు తెలంగాణ పథకాలు వర్తించవన్నమాట. కానీ ఏపీ సీఎం మాత్రం ఈ విషయంలో అంత పట్టింపు ఉన్నట్టు లేదు. ఎందుకంటే.. ఢిల్లీలో సీఎం ఓఎస్డీగా తెలంగాణ ప్రాంతానికి చెందిన తేలప్రోలు శ్రీనివాస్ అనే జర్నలిస్టును నియమించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

ఈ శ్రీనివాస్ గతంలో టివి5లో పనిచేస్తూ చంద్రబాబు పాదయాత్ర సమయంలో రాష్ట్రమంతా వెళ్లారు.. ఆ తర్వాత చంద్రబాబు పాదయాత్రపై పుస్తకాన్ని కూడా రాశారు. మొదటినుంచీ ఈయన టీడీపీ సానుభూతిపరుడేనట. అందుకే శ్రీనివాస్ కు ఢిల్లీలో చంద్రబాబునాయుడు తరపున మీడియా వ్యవహారాలు పర్యవేక్షించే బాధ్యత అప్పగించారు.  రెండేళ్లు పాటు శ్రీనివాస్ ఈ పదవి ఉంటారు.



మరింత సమాచారం తెలుసుకోండి: