మనం ఆధునిక సమాజంలో దూసుకెల్తున్నా ఇంకా పురాతన కాలం నాటి ఎన్నో అనుమానాలు, వదంతులు, కార్యాలు మనల్ని నిత్యం వెంటాడుతూనే ఉన్నాయి. ఒక వ్యక్తిని మానసికంగా, ప్రవర్తనా పరంగా హింసించి చివరకు అతడిని అంతమొందించడం లాంటివి మనం ఎన్నో పత్రికల్లో, టీవీ చానళ్లలో చూసే ఉంటాం. దీని పేరే చేతబడి. అంటే, ఒక వ్యక్తి నమూనాలను సేకరించి వాటి ద్వారా ప్రేరేపిత శక్తులను ఆహ్వానించి వాటిని ఆ వ్యక్తిపైకి ఉసిగొల్పడమే చేత బడి అనేది నానుడి. కానీ దీనిలో ఉన్న వాస్తవం ఎంత...? నిజంగా వాటికి మనుషులను అంతమొందించే శక్తి ఉందా...? ప్రజలందరు దీనికి ఎందుకు బయపడుతున్నారు...? ఈ సామాజిక దురాచాన్ని ప్రోత్సహించేవారు ఎందరు...? విమర్శించేవారు ఎందరు....? ఇలా దీనిపై ఉన్న అనుమానాలు ఎన్నో ఎన్నెన్నో....

 

చేతబడి ప్రభావం ప్రజలమీద ఎంతవరకు ఉంటుందో తెలియదు గాని, వీటి నెపంతో గ్రామాల్లో భారీగా వ్యాపారం మాత్రం నడుస్తుంది. గ్రామాల్లో ధనవంతులైన జమీందారుల పిల్లలను, మహిళలను ఈ చేతబడి కారణంతో వారిని హింసిస్తున్నారని, దీని నుండి రక్షణ పొందాలంటే మాత్రం పెద్ద మొత్తంలోనే ముట్టజెప్పాలని బెదిరిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. దీన్ని అడ్డుపెట్టుకొని ఎందరో ప్రజల జీవితాలతో చేలగాటాలు ఆడుతున్నారని తెలుస్తోంది. ఇటీవల కాలంలో కొన్నిగ్రామాల్లో చేతబడి చేస్తున్నారనే  నేపంతో కొంత మందిని ఆయా గ్రామస్తులు వారిని హతమార్చడం లాంటి వార్తలను కూడా మనం చూస్తూనే ఉన్నాం.   

 

దేవుడు అనేవాడు ఉంటే, దయ్యం అనేది కూడా ఉంటది అనేది నానుడి. ఏది ఏమైనా ప్రజలు మాత్రం ఈ చేతబడి కారణంగా చాలా నష్ట పోతున్నారన్నది మాత్రం వాస్తవం. దీనిపై రాజకీయ అండదండలు ఉన్నాయనే ఆరోపణలు కుడా వస్తున్నాయి. ఇలాంటివాటిపై అధికారులు, సంఘ సంస్కర్తలు, మీడియా, ప్రభుత్వం తగిన విధంగా స్పందించి ప్రజలను వీటి భారి నుండి రక్షించాల్సిన బాధ్యత మాత్రం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: