గత కొంత కాలంగా తమిళనాడులో ఎంతో ఉత్కంఠంగా కొనసాగిని అసెంబ్లీ ఎలక్షన్స్ ఫలితాలు రావడం అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత రెండోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం జరిగిపోయింది. సాధారణంగా తమిళనాడు రాజకీయాల సాంప్రదాయం ప్రకారం ఐదు సంవత్సరాలు  డీఎంకే పరిపాలనలో ఉంటే..ఐదు సంవత్సరాలు అన్నాడీఎంకే పరిపాలనో ఉండేది. కానీ ఈ సారి ఆ సాంప్రదాయానికి చెరమగీతం పాడారు తమిళనాడు ఓటర్లు.

రెండోసారి అమ్మ కే ఓటు వేసి తమ విధేయత చాటుకున్నారు. ఇక జయలలిత గెలుపు వెనుక ఆమె ప్రవేశ పెట్టిన పథకాలు అభివృద్ది కార్యక్రమాలే కారణం అని అక్కడ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక అన్నాడీఎంకే తరుపు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ఎంతో ఉత్సాహాంగా ఉన్న సమయంలో విషాదం చోటు చేసుకుంది.. అన్నాడీఎంకే ఎమ్మెల్యే శ్రీనివేల్ (65) గుండెపోటుతో మృతి చెందారు.  

తమిళనాడు తిరుప్పరండ్రం నియోజకవర్గం నుంచి ఆయన ఇటీవలి ఎన్నికల్లో అన్నాడిఎంకె తరపున ఎన్నికయ్యారు. గత వారం ఆయన గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరారు. అయితే శ్రీనివేల్ మృతి చెందినట్లు రూమర్స్ వెలువడ్డాయి. ఈ వార్తలను ఆయన కుమారుడు సెల్వకుమార్ ఖండించారు కూడా. మరోవైపు ఎమ్మెల్యే మృతి పట్ల అన్నాడీఎంకే పార్టీ సంతాపం తెలిపింది.



మరింత సమాచారం తెలుసుకోండి: