ప్రపంచంలో కొంత మంది శిశువులు జన్యు లోపంతో వింత వింత ఆకారాలతో పుడుతుంటారు. అయితే కొంత మంది పిల్లలు మంచి బరువుతో ఆరోగ్యంగా పుడుతుంటారు. సాదారణంగా పిల్లలు ఎంత ఆరోగ్యవంతంగా ఉన్న వారి బరువు మహా అంటే మూడు లేదా నాలుగు కిలోలు ఉంటారు. కానీ కర్ణాటకలో హసన్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వం హాస్పిటల్ లో ఓ ఆడశిశువు జన్మింది..అయితే ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏముందీ అనుకుంటున్నారా..! ఇప్పుడు ఆ పాప గురించే అక్కడ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది..ఇంతకీ ఆ వింత విషయం ఏమిటంటారా..! ఆ ఆడ శిశువు బరువు మాత్రం ఏకంగా 7.250 కిలోలుగా నమోదైంది.

దేశంలో ఇప్పటి వరకు శిశువుల బరువులో ఇదో రికార్డు కావొచ్చని వైద్యులు భావిస్తున్నారు. ఇక హాసన్‌కు సమీపంలోని బేలూరు తాలుకా దొడ్డహళ్లికి చెందిన నందినికి పురుటి నొప్పులు రావడంతో సోమవారం ఇక్కడి ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే ఆమె కడుపులో ఉన్న శిశువు బాగా లావు ఉన్నాడని అందుకోసం ఆమె సాధారణ కాన్పు ఇబ్బంది అవుతుందని ఆపరేషన్ చేసి శిశువును క్షేమంగా బయటకు తీశారు.

అయితే ఆ పాప పుట్టగానే బరువు చూసి డాక్టర్లు, నర్సులు ఒక్కసారే షాక్ అయ్యారట.. శిశువు బరువు 7.250 కిలోలుగా నమోదైంది.మంగళవారం ఉదయం మరోసారి బరువు చూడగా 6.800 కిలోలు ఉన్నట్లు వెల్లడైంది. శిశువును జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: