ప్రపంచ దేశాల్లో ఉగ్రవాదుల చర్యలు రోజు రోజుకీ పెచ్చుమీరుతున్నాయి..ముఖ్యంగా అరబ్ దేశాల్లో ఉగ్రదాడులో రోజూ ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఈ మద్య సిరియాలో ఆత్మహుతి దాడిలో ఎంతో మంది అమాయకులు బలైపోయారు. తాజాగా ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్‌లో  ఆత్మాహుతి దాడి జరిగింది. పగ్మన్ జిల్లాలో స్థానిక కోర్డు సిబ్బందిని ఓ వాహనంలో తీసుకు వెళ్తున్నారు..అయితే ఆ వాహనాన్ని టార్గెట్ చేసిన ఓ వ్యక్తి ఆత్మాహుతికి దాడికి పాల్పడ్డాడు. ఆ ధాటికి అక్కడి వాహనం ఒక్కసారే ముక్కలు అయిపోయింది..పది మంది అక్కడిక్కడే చపిపోయారు. మరొ నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ విషయాన్ని ఆ దేశ హోంశాఖ వెల్లడించింది. కాకపోతే ఈ ఘటనకు సంబందించి ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ తామే అని ప్రకటించలేదు. అయితే గత కొంత కాలంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వారిని టార్గెట్ చేసుకొని ఆత్మాహుతి దాడులు జరుగుతున్నాయని అక్కడి హోంశాఖ ప్రకటించింది. ఆఫ్గాన్ తాలిబన్ ఉగ్రవాద సంస్థ తమ కొత్తనేతను ప్రకటించిన కొద్ది సమయానికే ఈ ఘటన జరగడం గమనించతగ్గ విషయం.

ఇక శనివారం అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో తాలిబన్ అధినేత ముల్లాహ్ ఆఖ్తర్ మన్సూర్ హతమైన విషయం తెలిసిందే. మన్సూర్ మృతిని తాలిబన్ బుధవారం ధ్రువీకరించింది.  మరోవైపు తాలిబన్ కొత్త నేతగా హైబతుల్లా అఖంద్‌జాదాను ఎన్నుకున్నట్లు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: