ఇటీవల దేవాదాయ శాఖ ఆదాయం భారీగా పెరగడం పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర కామెంట్ చేశారు. ఏంటంటే, మాములుగా బాగా తప్పులు చేసినప్పుడే దేవుడిని మన్నించుమని కానుకలు హుండీ లో వేస్తామని, అందుకే దేవాదాయ శాఖ ఆదాయం పెరుగుతుందని అన్నారు. ఈ ఉదయం కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న ఆయన దేవాదాయ శాఖ పనితీరును సమీక్షిస్తున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు.


దేవాలయాలు, చర్చిలు, మసీదులు లేకుంటే ప్రజలు పిచ్చివాళ్లై ఉండేవాళ్లని, ఎక్కువ తప్పులు చేస్తూ, ఎక్కువ డబ్బును హుండీల్లో వేస్తున్నారని అన్నారు. కేవలం మద్యం తాగకుండా ఉండేందుకే దీక్షలు తీసుకుంటున్నారని, అందువల్లే సంవత్సరంలో 40 రోజులు అమ్మకాలు తగ్గుతున్నాయని 'అయ్యప్ప దీక్ష' పేరు ప్రస్తావించకుండా వ్యాఖ్యానించారు. అధికారుల కష్టం లేకపోయినా, దేవాలయాల ఆదాయం 27 శాతం పెరిగిందని చంద్రబాబు అనడం గమనార్హం.


మాములుగా అయితే మనం కోరుకున్న కోరిక నెరవేరితే హుండీ లో మనసులో అనుకున్న కానుక వేస్తామని మనం సాధారణంగా కోరుకుంటాం. కానీ చంద్రబాబు చేసిన వాఖ్యలు మాత్రం పలువురిలో సందేహాలను రేకెత్తిస్తున్నాయి. అంటే సమాజం ఆధునిక పోకడలు తొక్కే కొద్దీ నేరం అనేది పెరుగుతూ వస్తోంది చేస్తున్న నేరాలను కప్పిపుచ్చుకోవడానికి దేవుళ్లను మధ్యలో వీరు తెగ వాడుకుంటున్న నేపథ్యంలో ఈ కామెంట్ చేసినట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: