మొదట్లో ఆరోగ్యానికి సంబంధించిన ఆసనాలను టీవీ షోల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తూ ప్రజలకు యోగా పాఠాలు చెప్పిన రాందేవ్ బాబా. ఆ తర్వాత ఆరోగ్యానికి సంబంధించిన ఉత్పత్తులను తయారుచేసే సంస్థను ప్రారంభించి తక్కువ ధరకే అందరికీ సరకులను అమ్మే వ్యాపారాన్ని ప్రారంభించారు. యోగా గురువు తయారు చేసిన ఉత్పత్తులు కావడంతో ప్రజలు కుడా వాటి కొనుగోలుపై మక్కువ చూపారు. మొదటి నుంచీ రాజకీయ పరంగా బీజేపీ పార్టీకి సన్నిహితంగా ఉండే బాబా, ఆతర్వాత బెజేపీ అధికారంలోకి రావడంతోనే పేస్టులూ, సబ్బులు, బిస్కెట్లు, షాంపులూ, అగరబత్తీలు అంటూ దేశ వ్యాప్తంగా సంస్థలు ప్రారంభించి ప్రస్తుతం వేల కోట్ల వ్యాపారానికి అధిపతిగా నిలిచారు.


ఇప్పుడు అదే అధికారాన్ని అడ్డం పెట్టుకొని దేశ రాజధాని ఢిల్లీ లో పతంజలి ఉత్పత్తుల మరో యూనిట్ ను  నెలకొల్పేందుకు పావులు కదువుతున్నట్టు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  తన ఉత్పత్తులతో ఎఫ్ఎమ్ సీజీ సంస్థలకు గట్టి పోటీ ఇస్తున్న పతంజలి, తన తయారీ యూనిట్ లను పెంచుకోవాలని  భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉత్తరభారతదేశంలో పెరుగుతున్న ఎఫ్ఎమ్ సీజీ డిమాండ్ కు అనుగుణంగా, ఢిల్లీకి దగ్గర్లో ఓ తయారీ యూనిట్ ను యోగా గురు బాబా రాందేవ్ స్థాపించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.


ఉత్తరప్రదేశ్ లోని యమునా ఎక్స్ ప్రెస్ వేపై ప్రతిపాదించిన పతంజలి యూనివర్సిటీ క్యాంపస్ కు పక్కనే ఈ తయారీ యూనిట్ ను నిర్మించాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. దీనిపై యమునా ఎక్స్ ప్రెస్ వే ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ అథారిటీ(వైఈఐడీఏ)తో పతంజలి కంపెనీ చర్చిస్తోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రూ.320 కోట్లతో 200 ఎకరాల ప్లాట్ ను కొనుగోలు చేయనున్నట్టు సమాచారం. యూనివర్సిటీ కోసం 150ఎకరాలను రూ.240 కోట్లకు కొనుగోలు చేయనున్నారు.


ఫ్యాక్టరీ కోసం ఇండస్ట్రియల్ స్థలాన్ని, యూనివర్సిటీ కోసం ఇన్ స్టిట్యూషనల్ స్థలాన్ని కావాలని పతంజలి కంపెనీ తమతో చర్చించినట్టు వైఈఐడీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అరుణ్ వీర్ సింగ్ తెలిపారు. అయితే ప్రస్తుతం పతంజలి కేవలం ఒక్క తయారీ యూనిట్ నే కలిగిఉంది. అది ఉత్తరఖాండ్ లోని హరిద్వార్ లో ఉంది. మొదట 10 ఎకరాలతో ప్రారంభించిన ఈ యూనిట్, ప్రస్తుతం 150 ఎకరాలకు విస్తరించారు. వచ్చే రెండేళ్లలో మరో నాలుగు తయారీ యూనిట్లను స్థాపించాలని పతంజలి భావిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: