ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఏకచక్రాధిపత్య పాలన కొనసాగిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం ఒకే ప్రతిపక్షం ఉంది. మిగితావాటిని పార్టీలో విలీనంచేసుకొని ఎదురు లేని నాయకుడిగా దూసుకుపోతున్నారు కేసీఆర్ ఆయనకీ అడ్డొచ్చే ప్రతి ఒక్కరికి తన రాజకీయ చాకచక్యంతో వీరికి చెక్ పెట్టడమే కాకుండా, వారిపై ప్రజలకు ద్వేషం కలిగేలా చేయడమే ఆయన నైపుణ్యం. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఎన్నిక ఏదైనా గెలుపు మాత్రం టీఆర్ఎస్ పార్టీ దే అన్నది వారి నానుడి. అయితే వీరి నానుడికి చెక్ పెట్టడానికి సిద్ధమయ్యారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఆయనకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఏ రాష్ట్ర ఎన్నికలైన విజయ పరంపర కొనసాగించడమే ఆయన లక్ష్యం.

 

కానీ తెలంగాణ లో ఉన పరిస్థితి వేరు. కారణం, ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేపట్టిన పార్టీకే ప్రజలు నీరాజనం పలికి పదవిని కట్టబెట్టారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో వెనకటి నుంచి బీజేపీ పరిస్థితి అంతంతమాత్రమే. ఇక్కడ ఎక్కువగా కాంగ్రెస్ తప్పితే బీజేపీ అధికారం చేపట్టిన దాఖలాలు మాత్రం ఏ మాత్రం లేవు. అయితే ఇప్పుడు మోడీ మేనియా వీస్తున్న సందర్భంలో కనీసం ప్రతిపక్ష హోదా అయినా దక్కకపోదా అన్న ఆశతోనే అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలోపేతం చేయడానికి ఈ నెలాఖరులో ఒకసారి, జూన్ మొదటివారంలో మరోసారి రాష్ట్రానికి రానున్నారు. దక్షిణాదిన పార్టీ ఎదగడానికి తెలంగాణ రాష్ట్రంలోనే అవకాశం ఉందని కమల దళం భావిస్తోంది. ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ రెండేళ్ల కాలంలో అమలు చేసిన సంక్షే మ, అభివృద్ధి కార్యక్రమాలనుగురువారం నుంచి జూన్ 15 దాకా ప్రచారం చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా అమిత్‌షా ముందుగా ఈ నెల 29, 30 తేదీల్లో రాష్ట్రంలో పర్యటిస్తారు. జూన్ మొదటి వారంలో రెండోసారి రాష్ట్రానికి వస్తారు.

తెలంగాణలో బీజేపీ బలోపేతం కావడానికి విస్తృతమైన అవకాశాలున్నాయని, దానికి అనుగుణంగా రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేయడానికి అమిత్‌షా ప్రాధాన్యత ఇస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రధానంగా గ్రామాల్లో పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తున్నారు. కిసాన్ బీమా పథకం ద్వారా రైతులకు జరుగుతున్న మేలు, రైతాంగం కోసం కేంద్రం తెచ్చిన సంక్షేమ పథకాలను గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తామని పార్టీ నేతలు చెపుతున్నారు. రాష్ట్రాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందన్న ఆరోపణలను, ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఉదాహరణలతో పాటు పల్లెల్లో ప్రచారం చేస్తామని వెల్లడించారు.



‘ఊరూరా బీజేపీ-ఇంటింటా మోదీ’ నినాదంతో రాష్ట్రంలో 8 బృందాలు పర్యటిస్తాయి. వీటిలో 16 మంది కేంద్ర మంత్రులు, ఏడుగురు పార్టీ జాతీయ నాయకులు, రాష్ట్రానికి చెందిన ముఖ్యనేతలు పాల్గొననున్నారు. ఈ ప్రచార కార్యక్రమానికి సంబంధించిన పని విభజన, వ్యూహంపై చర్చించడానికి రాష్ట్ర కార్యవర్గం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మంగళవారం సమావేశమైంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు, ఎమ్మెల్యేలు జి.కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రా రెడ్డి,ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు, నాయకులు నాగం జనార్దన్‌రెడ్డి, చింతా సాంబమూర్తి, జి.ప్రేమేందర్‌రెడ్డి, ఆచారి తదితరులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: