విజయవాడలో జరుగుతున్న రెండు రోజుల కలెక్టర్ల సదస్సు తొలిరోజు సమావేశంలో చంద్రబాబు చేసిన కొన్ని కామెంట్లు వివాదాస్పదమవుతున్నాయి. హిందువులను చంద్రబాబు అవమానించినట్టు ఉందని కొన్ని పత్రికలు, ఛానళ్లు విశ్లేషిస్తున్నాయి. వివిధ శాఖలు- వాటి ఆదాయాల గురించి మాట్లాడే సందర్భంగా చంద్రబాబు అదుపుతప్పి మాట్లాడి అభాసుపాలయ్యారని విశ్లేషిస్తున్నాయి. 

ఇంతకూ చంద్రబాబు ఏమన్నారంటే..  తప్పులు చేసేవారే ఎక్కువగా గుళ్లకు వెళుతున్నారు.. ఎక్కువ తప్పులు చేసి హుండీలో ఎక్కువ డబ్బులు వేస్తున్నారు... అందుకే రాష్ట్రంలో దేవాలయాల ఆదాయం బాగా పెరుగుతోంది.. అధికారులు కష్టపడినా.. పడకపోయినా రాష్ట్ర ఆదాయంలో  27 శాతం ఆ శాఖ నుంచే వస్తోంది.. అని చంద్రబాబు కామెంట్ చేశారు. 

గుడికెళ్లేవారంతా అవినీతిపరులేనా..?



అంతేకాదు.. చర్చిలు, మసీదులు, దేవాలయాలు లేకపోతే చాలామందికి పిచ్చి పట్టేదని కూడా చంద్రబాబు అన్నారు. ప్రజలకు కష్టం వస్తే దేవాలయాలకు వెళుతున్నారని, కొంతమంది బ్రాందీ, విస్కీలు తాగి సంతృప్తి చెందుతున్నారని బాబు విశ్లేషించారు. మద్యం తాగకుండా ఉండడం కోసం కొందరు అయ్యప్ప దీక్ష చేస్తున్నారని, ఆ 40 రోజులు మద్యం అమ్మకాలు తగ్గిపోతున్నాయని కామెంట్ చేశారు.

చంద్రబాబు వ్యాఖ్యలు గుళ్లకు వెళ్లి కానుకలు వేసే హిందువులంతా అవినీతిపరులే అనే అర్థం వచ్చేలా ఉన్నాయ. పాపాలు చేసి గుడికి వెళ్లి దండం పెట్టుకుని కానుక వేసి వాటిని కడుక్కున్నామని భావించే వారు లేకపోలేదు. కానీ అలగాని గుళ్లుకు వెళ్లేవాళ్లంతా అవినీతిపరులే అనే అర్థం వచ్చేలా మాట్లాడటం హిందువులకు ఇబ్బంది కలిగించేదే.. ఈ కామెంట్లపై హిందూ సంఘాలు ఎలా స్పందిస్తాయో..!?



మరింత సమాచారం తెలుసుకోండి: