ఉత్తరప్రదేశ్‌కి చెందిన యోగిత మహారాష్ట్రలోని నందుర్‌బర్‌ నివాసి. లా పట్టభద్రురాలు. చదువంటే యోగితకు ఎంతో ఇష్టం. యోగితా రఘువంశి.. బికాం, ఎల్‌ఎల్‌బీ! కామర్స్‌లో.. న్యాయశాస్త్రంలో మంచి పట్టున్న మహిళ. ప్రొఫెషనల్ లాయర్‌గా రాణిస్తూ ఉన్నతంగా ఎదగాలన్నది ఆమె లక్ష్యం. కానీ ఉన్నట్టుండి ఆమె ఆశలు అడియాసలయ్యాయి. 1991లో భోపాల్‌కి చెందిన ఒక వ్యక్తితో వివాహమైంది. పెళ్లికి ముందు అత్తింటివాళ్లు తమ కొడుకు భోపాల్‌ హైకోర్టులో లాయర్‌గా ప్రాక్టీసు చేస్తున్నాడని చెప్పారు.

 

కాని అది అబద్ధం అనే విషయం పెళ్లి తరువాత కాని తెలియలేదు యోగితకి. అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నారని తెలిసి ఆమె ఎంతో బాధపడింది. అబద్ధం ఆడారన్న బాధ మనసును గుచ్చుతుండడంతో భార్యాభర్తల మధ్య బంధం ఏమంత సంతోషంగా ఉండేది కాదు. ఆయన చనిపోయి ఇప్పటికీ 16 సంవత్సరాలు. భర్త అకాల మరణంతో దిగ్భ్రాంతికి గురైంది యోగిత. లాయర్‌గా రాణించాలనుకున్నప్పటికీ పిల్లల్ని బాగా చదివించాలంటే ఆ సంపాదన సరిపోదనుకుని డ్రైవింగ్‌వైపు దృష్టి మళ్లించింది.

 

 స్వతహాగా ట్రక్‌లను కొనుక్కుని పురుషాధిక్యతగల మోటార్ డ్రైవింగ్ ఫీల్డ్‌లో అద్భుతంగా రాణిస్తూ.. ఇండియాలోనే హయ్యెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉమెన్ డ్రైవర్‌గా రికార్డు సృష్టించింది! ఈ దారిలో వెళ్లాలని నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. కాని అవహేళనలు, ప్రతికూలతలు ఎన్నో ఎదుర్కొన్నాను. అవి నన్నెంతగానో బాధపెట్టేవి. అయితే అతి తక్కువ కాలంలోనే ఆ బాధ నుంచి బయటపడి నా పని నేను చేసుకోవడం మొదలుపెట్టాను. ఇప్పుడయితే ఎంతో ఆత్మవిశ్వాసంతో, గట్టిగా తయారై పురుషులకి మాత్రమే పరిమితైన రంగంలో ధైర్యంగా పనిచేస్తున్నాను. 2013 వరకు చూసుకుంటే నా ట్రక్‌ను ఐదులక్షల కిలోమీటర్లు నడిపానని చెప్పుకొచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: