ఏపీకి ప్రత్యేక హోదా రాదని తేలిపోయింది. కానీ ఇప్పటికీ టీడీపీ- బీజేపీ నేతలు మాత్రం ఇంకా ఈ విషయంపై ప్రజలను భ్రమల్లోనే ఉంచుతున్నారు. ఇంకా హోదా సాధిస్తామంటూ సొల్లు కబుర్లు చెబుతూనే ఉన్నారు. ఇవి జనం నమ్మరని తెలిసినా ఆ రెండు పార్టీల నేతలు మాత్రం అదే పాటపడుతున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు హోదా ప్రేమకు శీలపరీక్ష పెట్టేశారు కాంగ్రెస్ నేతలు. 

అసలు ప్రత్యేక హోదాపై ఎన్డీఏ సర్కారును చంద్రబాబు అడగనే లేదనే కొత్త వాదన బయలు దేరింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు కొత్త ప్రతిపాదన తెచ్చారు. ఎలాగూ ప్రత్యేక హోదా సాధనపై టీడీపీకి విశ్వాసం ఉంది కనుక.. త్వరలో జరగబోయే మహానాడు సమావేశాల్లో ప్రత్యేక హోదాపై తీర్మానం పెట్టాలని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు సూచించారు.  

మహానాడులో ప్రత్యేక హోదా తీర్మానం ఉంటుందా.. 



రాజకీయ వైరుధ్యాలను పక్కనబెట్టి  విభజన చట్టం హామీల సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి రావాలని కేవీపీ రామచంద్రరావు అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఓ లేఖ రాశారు. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు జరగబోయే మహానాడులో చేయబోతున్న తీర్మాణాల్లో.... పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ కల్పించాలన్న అంశం కనిపించటం లేదని అన్నారు. 

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి రెండేళ్లు గడిచినా.... నాటి ప్రధాని ఇచ్చిన హామీలు గాని, విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు గాని అమలు గాకపోవటం రాజ్యాంగ విరుద్ధమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన సాయం విషయంలో ఒకరినొకరు విమర్శించుకోవటం మాని.... అందరం కలిసి కేంద్రాన్ని నిలదీయాలనేది తన భావనగా లేఖలో పేర్కొన్నారు. నిర్ధుష్ట గడువు లోగా హామీలు నెరవేర్చేలా అవసరమైన ఒత్తిడి కేంద్రంపై తెస్తారని ఆశిస్తున్నట్లు ముఖ్యమంత్రిని కోరారు. మరి చంద్రబాబు మహానాడులో ప్రత్యేక హోదా శంఖం  పూరిస్తారా..!?



మరింత సమాచారం తెలుసుకోండి: