భారత దేశంలో గత కొంత కాలంగా మహిళలను, యువతులను చివరికి చిన్నారులను సైతం వదలకుండా అతి దారుణంగా హింసిస్తూ అత్యాచారం, హత్యలకు పాల్పపడుతున్న కామాంధులను గురించి ప్రతిరోజూ వింటూనే ఉన్నాం. అయితే భారత దేశంలో నిర్భయ చట్టం అమల్లో ఉన్నప్పటికీ వీరి ఆగడాలు రోజు రోజుకీ మితిమీరిపోతూనే ఉన్నాయి. కొంత మంది ఈవ్ టీజింగ్ తో మహిళలను, యువతులను ప్రతిరోజూ హింసిస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఈవ్ టీజింగ్ కేసులో చాలా మంది అమాయకులు బలైపోయారు.

బస్ లో ఈవ్ టీజింగ్ చేస్తూ..


ముఖ్యంగా కొంత మంది ఆకతాయిలు బస్సుల్లో యువతులను టీజ్ చేయడం, నడుముపై గిల్లడం పదే పదే తాకడం ఎక్కడపడితే అక్కడ చేయ్యి వేయడం లాంటి చూస్తుంటా..అయితే ఆ సమయంలో వారు ఏంచేయలేని పరిస్థితిలో ఉంటారు..కొంత మంది మహిళలు ఎదురుతిరిగి ఆకతాయిలను ఎదుర్కొంటారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ అద్భుతమైన ప్రయోగం చేస్తుంది.  బస్సులో పానిక్ బటన్స్ అమర్చబోతున్నారు. పానిక్ బటన్స్ అంటే ఏంటి అనుకుంటున్నారా? అది ఎలా పని చేస్తోంది అనుమానం ఉందా?. బస్సులో మహిళలను వేధిస్తే బాధితులు పానిక్ బటన్ నొక్కవచ్చు.

ఈవ్ టీజింగ్ చేస్తూ..


ఈ సమాచారమంతా జిపిఎస్ సిస్టమ్ ద్వారా పోలీస్ స్టేషన్‌కు చేరుతోంది. అంతేకాదు సిసి టివి దృశ్యాలు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు చేరుతాయి. వెంటనే పోలీసులు అప్రమత్తమై నిందితులను అరెస్టు చేస్తారు.అకతాయిలు వెకిలి చేష్టలు మానుకోవాలని షీటీమ్ మెంబర్స్ తెలియజెస్తున్నారు. పానిక్ బటన్ సిస్టమ్ రాజస్థాన్‌లో విజయవంతంగా సక్సెస్ అయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: