తమిళనాట మొన్నటి వరకు గరం గరంగా కొనసాగిన ఎన్నికల్లో జయలలిత రెండవ సారి ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రి పదవి అలంకరించిన విషయం తెలిసిందే. తాజాగా తమిళనాట ఇప్పుడు ఓ వార్త చక్కర్లు కొడుతుంది...అదే జయలలిత డ్యాన్స్ షో గురించి. ఇంతకీ అమ్మ డ్యాన్స్ షో ఏంటా అని అశ్చర్యపోతున్నారా..! అసలు విషయానికి వస్తే...కర్ణాటకలోని  నాగునవిళ్లి గ్రామస్తులకు జయలలితపై ఇప్పటికీ ఎంతో ప్రేమ కురిపిస్తారట. వాస్తవానికి కర్ణాటక,తమిళనాడు మద్య కావేరీ జలాల కోసం ఇప్పటికీ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది...అంతే కాదు అక్కడ  నాగువినహళ్లి గ్రామం ఉన్న మాండ్య జిల్లా కావేరి జలాల మీదనే ఎక్కువగా ఆధారపడి ఉంది. కానీ అక్కడి ప్రజలకు జయలలిత అంటే పంచ ప్రాణాలు..చాలా గౌరవిస్తూ అభిమానిస్తారు.అంతే కాదు 50 ఏళ్ల క్రితం నాటి జ్ఞాపకాల్లోకి జారుకుంటారు.

సీఎం జయలలిత


 అప్పట్లో జయలలిత తమిళ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. తమ గ్రామంలో ఓ పాఠశాలను నిర్మించేందుకు సహకరించాల్సిందిగా 19 ఏళ్ల ఆమెను గ్రామస్తులు కోరారు. ఆమె వెంటనే అంగీకరించారు. అలా 1967 మార్చి 19న మైసూర్ యూనివర్సిటీలోని క్రాఫర్డ్‌ హాల్‌లో జయలలిత నృత్య ప్రదర్శన ఏర్పాటుచేశారు. ఈ షోకు రూ. 10, 25, 50 టికెట్‌ ధరలుగా నిర్ణయించారు.

యుక్త వయసులో జయలలిత


ఈ షోలో జయలలిత అద్భుతమైన నృత్య ప్రదర్శనతో ఆహూతులను అలరించారు. ఈ షో అద్భుతమైన విజయం సాధించడంతో నాగువినహళ్లి గ్రామంలో పాఠశాలను కట్టడానికి తగిన డబ్బు సమకూరింది. 50 ఏళ్ల కిందట పెద్ద మనస్సుతో తమ గ్రామానికి సాయం చేసిన జయలలితను నాగువినహళ్లి లోని వృద్ధులు ఇప్పటికీ కృతజ్ఞతాభావంతో ఇప్పటికీ గుర్తు చేసుకుంటారట అక్కడ ప్రజలు. 



మరింత సమాచారం తెలుసుకోండి: