దేశంలో అత్యన్నత సాంకేతిక విద్యా సంస్థలైన ఐఐటీ ల స్థాపనను మరింతగా విస్తరించి భారత్ లో తయారీ రంగాన్ని ప్రోత్సహించాలనే మోడీ సంకల్పం అమల్లోకి రానుంది. దేశ వ్యాప్తంగా ఐఐటీ లా ఏర్పాటు ద్వారా మరింతగా సాంకేతిక అభివృద్ధిని అందిపుచ్చుకోవడమే కాకుండా దేశాన్ని అభివ్రుది పథంలోకి పయనింపజేయవచ్చని సంకల్పించిన ప్రధాని ఆ దిశగా అడుగులు వేశారు. దీంతో మారింత మంది విద్యార్థులకు ఈ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో విద్యను అభ్యసించే అవకాశం ఏర్పడింది. మోడీ ఆలోచనా విధానం పట్ల ఉన్నత విద్యావంతులు, సాంఘిక సంస్కర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

ఆంధ్రప్రదేశ్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ-తిరుపతి), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)ల ఏర్పాటుకు బుధవారం కేంద్ర కేబినెట్ అధికారికంగా ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో తిరుపతి సహా పాలక్కడ్, ధార్వాడ్, భిలాయ్, గోవా, జమ్మూల్లో ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లను ‘ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ చట్టం-1961’లో చేర్చడానికి అనువుగా  ఈ చట్టాన్ని సవరించే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఐండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్(ఐఎస్‌ఎమ్) ధన్‌బాద్‌ను ఐఐటీగా స్థాయి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

మరోవైపు, ఆంధ్రప్రదేశ్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్-2001 ప్రకారం రిజిస్టర్ అయిన ఏపీలోని ఎన్‌ఐటీ(నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) ఏర్పాటుకు సంబంధించిన(పశ్చిమగోదావరి జిల్లాలో తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటైంది) సవరణను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: