బీజేపీ స‌ర్కార్ కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చి నేటికి రెండేళ్లు గడిచాయి. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ప‌రిపాల‌న‌లో అంచనాలు ప‌లు విధాలు కొన్ని ప్ర‌శంసా పూర్వ‌కం, కొన్ని అంతగా ప్ర‌శంస‌ల‌కు నోచుకోనివి. మ‌ద్ద‌తు దారులు ఆయ‌న్ను కొనియాడుతుంటే... ఎన్నిక‌ల్లో ఇచ్చిన వాగ్దానాలు నెర‌వేర్చ‌నుందుకు ప్ర‌తిపక్షం తీవ్రంగా నే విమ‌ర్శిస్తున్నాయి. అంతేకాదు ఆయ‌న పాల‌న‌లోనే మ‌త ప‌ర‌మైన అల్ల‌ర్లు కూడా పెద్ద ఎత్తున జ‌రిగాయి. గ‌తంలో మోడీ గుజ‌రాత్ సీఎంగా ఉన్న‌ప్పుడే గోద్రా అల‌ర్ల చ‌రిత్రలో మోడీ అవ‌లంభించిన విధానం ఇప్ప‌టికి దేశ ప్ర‌జ‌లు మ‌రిపోలేరు.ఎన్నిక‌ల నెర‌వేర్చ‌టం ఎలా అన్న‌ది న‌రేంద్రమోడీకి ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌. ఎన్నిక‌ల‌ల వాగ్దానాల‌ను 5 ఏళ్ల‌లో నెర‌వేర్చ‌లేమ‌నే విష‌యం నరేంద్ర‌మోడీ కి బాగా తెలుసు. కానీ  కొంత వ‌రకు దిద్దుబాగు చేసుకోవాల‌ని అభిప్రాయ‌ప‌డేవారు చాలా మంది ఉన్నారు. వాస్తవానికి మోడీ స‌ర్కార్ ఏమీ చేయ‌లేద‌ని కాదు. తొలి రెండు సంవత్సరాల్లో ప్ర‌ధాని 46 స‌రికొత్త ప‌థ‌కాలు, మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా స్వ‌చ్చ్ భార‌త్ స్టాండ‌ప్ ఇండియా భీమా ప‌థ‌కాలు, ఉజ్వ‌ల ప‌థ‌కం, పంట‌ల బీమా ప‌థ‌కం లాంటి అనేక ప‌థ‌కాలు విజ‌య‌వంతంగా ప్రారంభించ‌బ‌డ్డాయి.  కానీ కొన్ని స‌వ్యంగా అములుకు నోచుకోలేదు. 

మోడీ ముందున్న బృహ‌త్త‌ర కార్యాలు...


నిబ‌ద్ద‌మైన ఉన్న‌తాధికార వ‌ర్గం, లెజిస్లేట‌ర్లు, పార్లమెంట‌రీయ‌న్ ల స‌హ‌కారం ఇక్క‌డ అవస‌రం. అందువల్లే, నెల‌ల‌లో క‌నీసం ఏడు రాత్రులు త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో గడుపుతూ, ప్ర‌భుత్వ అభివృద్ధి చొర‌వ‌ల‌నే ప్ర‌చారం చేయాల‌ని బీజేపీ పార్ల‌మెంట్ స‌భ్య‌లును కోరారు ప్ర‌ధాని. మంచి జీవితం కోరుకుంటున్న ఆకాంక్షాప‌రులైన‌ ఓట‌ర్ల త‌ర‌గ‌తి నుంచి  కూడా స‌మ‌స్య వ‌స్తున్న‌ది.  దేశ జ‌నాభాలో 65 శాతం యువ‌త‌. 2014 ఎన్నిక‌ల్లో వారే మోడీ బ‌లం. సుపరిపాల‌న‌, అభివృద్ధిని ఆయ‌న వారికి వాగ్దానం చేశారు. అయితే ఓట‌ర్ల ఓర్మిరాహిత్యం. అభివృద్ధి వేగం స‌రితూగ‌టం లేదు. అందువ‌ల్ల సగం నిండు, సగం ఖాళీ ప‌రిస్థితి ఉత్ప‌న్న‌మ‌వుతున్న‌ది. మ‌ద్ద‌తుదారులు స‌గం నిండును స‌మ‌ర్థిస్తుండ‌గా, విమర్శ‌కుల సగం ఖాళీ ప‌రిస్థితి ఉత్ప‌న్న మువుతుంది, మ‌ద్ద‌తుదారులు సగం  నిండును స‌మ‌ర్థిస్తుండ‌గా, విమ‌ర్శ‌కులు స‌గం ఖాళీ అంటున్నారు. వ‌చ్చే సంవ‌త్స‌రం గ‌నుక ప‌రిస్థితి మెరుగు ప‌డ‌క‌పోతే, అసంతృప్తి మొలకెత్తటం ఆరంభ మవుతుంది.మోడీ ప్ర‌భుత్వం ముందున్న బృహ‌త్త‌ర కార్యాలు.... ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను పున‌రుద్ద‌రించ‌టం, బాధ‌ల్లో ఉన్న వ్య‌వ‌సాయ‌దారు స‌ముధాయంతో బ‌ల‌మైన స‌ఖ్య‌త ఏర్ప‌ర‌చు కోవ‌టం, యువ‌త‌కు ఉద్యోగాలు సృష్టించ‌టం.

ముస్లీం ల‌ప‌ట్ల వికృత విద్వేష ప్రచారానికి సంఘ్ ప‌రివార్ తెర తీసింది...


ఇక‌పోతే, న‌రేంద్ర మోడీ ప్ర‌ధానిగా భాద్య‌త‌లు చేపట్టిన వెను వెంట‌నే కేంద్ర‌మంత్రులు ఎంపీలు విద్వేష పూరిత ఉపన్యాసాలు, ప్ర‌క‌ట‌న‌ల ఉప్పెన సృష్టించారు. మోడీ ప్ర‌ధానిగా అడుగుపెట్టిన  తొలి పార్ల‌మెంటు స‌మావేశం విద్వేష ప్ర‌క‌ట‌న‌ల ఉప్పెన సృష్టిస్తున్న వారిపై భార‌తీయ నేర శిక్ష్మాస్మృతి ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటారా లేదా అని నిల‌దీసింది. క‌నీసం పార్లమెంట్ కు అటువంటి హామీ ఇవ్వ‌టానికి మోడీ తిర‌స్క‌రిస్తూనే వ‌చ్చారు. ల‌వ్ జిహాదీ, ఘ‌ర్ వాప‌సీ, గో మాంస వ్య‌తిరేక ఉద్య‌మాలు, విద్యార్థుల‌కు యూనిఫాం నిర్ణ‌యించ‌టం, నైతిక‌త పేరుతో వికృత  గ‌స్తీలు వంటి అనేక రూపాల్లో అన్య మ‌త విశ్వాసాలు అవ‌లంబించేవారిపై ప్ర‌భుత్వం దాని అండ‌తో సంఘ ప‌రివారం బ‌హిరంగా యుద్ద‌మే ప్ర‌క‌టించింది. ప్ర‌త్యేకించి ముస్లీం ల ప‌ట్ల వికృత విద్వేష ప్రచారనికి తెర తీసింది. గోమాంసం తిన్నాడ‌న్న అనుమానం  తో ఉత్త‌ర ప్ర‌దేశ్ లో అత్లాఖ్ ను హ‌త్య చేయ‌టం , జార్ఖండ్ లోని ల‌తేహ‌ర్ లో గోవుల వ్యాపారం చేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌తో ఇద్ద‌రు యువ‌కుల‌ను కిరాతకంగా హ‌త్య చేయ‌టం మత‌సామ‌ర‌స్య పూర్వ‌క వాతావ‌ర‌ణాన్ని మ‌రింత దెబ్బ‌తీసింది. దేశ విద్యా వ్య‌వ‌స్థ‌ను ప‌రిశోధ‌నా రంగాన్ని మ‌తోన్మాద పూరితం చేసే చ‌ర్య‌లు కూడా మొద‌లైనాయి,


జెఎన్ యూ విద్యార్ధి సంఘం నేత‌ల‌పై దేశ ద్రోహం కేసులు బ‌నాయించింది...


అనేక ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌ల‌కు ఆర్ఎస్ఎస్ ప్రచార‌కుల‌ను నియ‌మించారు. పాఠ‌శాల‌లు. క‌ళాశాల‌ల పాఠ్యాంశాల‌ను తిరిగి రాసే ప్ర‌క్రియ ఊపందుకుంది. దేశం గ‌ర్వించ‌దగ్గ జేఎన్ యూ, చిత్ర నిర్మాణ విద్యా సంస్థ‌, ఐఐటీ లు, ఇత‌ర ఉన్న‌త విద్యా సంస్థ‌ల‌పై ప్ర‌భుత్వం దాడికి దిగింది. ఇవి లౌకిక విలువ‌ల‌కు కేంద్రాలుగా ఉండ‌టంతో ఆయా సంస్థ‌ల‌లో  చదువుకుంటున్న విద్యార్థులు, అధ్యాప‌కులు ఆర్ఎస్ఎస్ ప్ర‌తిపాధిత హిందూత్వ సిద్ధాంతాల‌ను అంగీకరించేలా ఒత్తిడి చేయ‌ట‌మే ఈ దాడి ల‌క్ష్యం. హేతుబ‌ద్దం కానీ, కల్పిత సాక్ష్యాల ఆధారంగా జేఎన్ యూ విద్యార్థి సంఘం నేత‌ల‌పై దేశ ద్రోహం కేసులు బ‌నాయించ‌టానికి కూడా వెన‌కాడ‌లేదు. రోహిత్ వేముల వంటి ద‌ళిత  మేధావిని బ‌లిగొన్న హెచ్ సీయూ పై ఏబీవీపీ గూండాల దాడి హిందూత్వ ప్రాజెక్టు యొక్క ద‌ళిత వ్య‌తిరేక‌త‌ను స్ప‌ష్టంగా వెల్ల‌డిస్తోంది. ఇక 2013 లో బీజేపీ మ‌ద్ద‌తుతోనే రూపొందించిన భూసేక‌ర‌ణ చ‌ట్ట స‌వ‌ర‌ణకు ప‌లు ద‌ఫాలు ఆర్డినెన్స్ లు జారీ చేసింది. కుదేల‌వుతున్న రైతాంగాన్ని కాపాడ‌టానికి బదులు కార్పొరేట్ ప్ర‌యోజ‌నాల కోసం కారు చౌక‌గా రైతుల భూములు కాజేయ‌ట‌మే ఈ ఆర్డినెన్సుల ల‌క్ష్యంగా ఉంది. రాజ్య‌స‌భ తిర‌స్క‌రించ‌టంతో ఈ ప్ర‌య‌త్నాల‌ను వ‌దులు కోవాల్సి వ‌చ్చింది. 


బీజేపీకి రాజ్య‌స‌భ లో త‌గినంత  మెజారిటీ లేదు...

లోక్ స‌భ లో త‌న సంఖ్యా బలంతో ప్ర‌తిప‌క్షాల గొంతు నుల‌మ‌టంలో విజయం సాధిస్తున్న బీజేపీ కి రాజ్య‌స‌భ‌లో త‌గినంత మెజారిటీ లేక‌పోవ‌డం కొర‌క‌రాని కొయ్య గా మారింది. దాంతో అనేక  సాధార‌ణ బిల్లుల‌ను సైతం ఆర్థిక బిల్లులుగా ప్ర‌క‌టిస్తూ లోక్ స‌భ‌లో ఆమోదించుకుని ప‌బ్బం గ‌డుపుకోవ‌టానికి ప్ర‌భుత్వం సిద్దమ‌య్యింది. ఆర్థిక బిల్లులు చ‌ట్ట రూపం దాల్చ‌టానికి రాజ్య‌స‌భ అనుమ‌తి అవ‌స‌రం లేద‌ని రాజ్యాంగం చెబుతోంది. రాజ్యాంగాన్ని ఈ విధంగా  వ‌క్రీక‌రిస్తోంది మోడీ ప్ర‌భుత్వం. ఆధార్ బిల్లు ఈ విధంగా దొడ్డి దోవ‌న ప్ర‌భుత్వం అనుమ‌తి పొందిన బిల్లుల్లో ఒక‌టి. ఆధార్ బిల్లును ద్ర‌వ్య బిల్లుగా ప్ర‌క‌టించ‌టాన్ని స‌వాల్ చేస్తూ దాఖ‌లైన వ్యాజ్యాన్ని  సుప్రీం కోర్టు  త్రిస‌భ్య న్యాయ స్థానం విచార‌ణ‌కు చేప‌ట్టింది. ఆ ప్ర‌జాస్వామికమైన 356 అధిక‌ర‌ణాన్ని దుర్వినియోగం చేయ‌టంలో బీజేపీ ప్ర‌భుత్వం గత ప్ర‌భుత్వాల‌కు ఏ మాత్రం తీసిపోదు అని రుజువు చేసుకొన్న‌ది. ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె  దింప‌టానికి చేసిన ప్ర‌య‌త్నాల‌ను సుప్రీం కోర్టు తిప్పి కొట్టింది. 356 అధికర‌ణాన్నిదుర్వినియోగం చేయ‌బూను కోవ‌డం పై సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా మంద‌లించింది. ప్రజల ప్రజాతంత్ర హక్కులు, పౌర హక్కులు, గౌరవంగా జీవించే హక్కు, భావ ప్రకటనా స్వేఛ్చ వంటి హక్కులపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున దాడులు జరుగుతున్నాయి. 


విదేశాంగ విధానంలో దేశ ప్ర‌తిష్ట‌ను పైకెత్తే ప్రయ‌త్నం చేశారు....

అయితే వాస్త‌వం కావ‌చ్చు...ఊహ‌కావ‌చ్చు. అభివృద్ది ఎజండా ను విస్మ‌రించార‌న్న భావ‌న‌ను బీజేపీ స‌రిదిద్దుకోవ‌ల‌సి ఉంది. సామాజికంగా, మైనారిటీలు అభ‌ద్ర‌తా భావంలో ఉన్నారు రాజ‌కీయంగా... ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో అసోం లో బీజేపీ గెలుపొంద‌టం, ప‌శ్చి బెంగాల్, కేర‌ళ ల్లో  స్థితి ని మెరుగుప‌రుచుకోవ‌టం మోడీకి కొంత ఉత్సాహం క‌లిగిస్తుంది. బీజేపీ త‌న సంకీర్ణ  భాగ‌స్వామ్య ప‌క్షాల అభిప్రాయాలు వింటుంద‌ని, వాటి ఆందోళ‌న‌ల‌ను  ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటుంద‌నే విశ్వాసం  వారిలో కలుగ‌జేయాలి. పార్లమెంట్ లో, ఎగువ‌స‌భ లోల కీల‌క‌మైన బిల్లులు ఆమోదం పొంద‌టంలో మోడీకి ఆవ‌రోధాలు కొన‌సాగుతాయి. సర్ధుబాటు ధోర‌ణి బ‌హుశా ఫ‌లితాలివ్వ‌వ‌చ్చు. విదేశాంగ  విధానం విష‌యంలో, భార‌తదేశ ప్ర‌తిష్ట‌ను పైకెత్త‌టానికి  అయ‌న గ‌ట్టి ప్ర‌య‌త్నాలే చేశారు. అయితే పాకిస్థాన్ , నేపాల్ విధానాల్లో కొంత మెరుగుద‌ల అస‌వ‌రం. ప్ర‌భుత్వం అనేది  స్ప్రింట్ కాదు మార‌థాన్ నిర్వ‌హించ‌టంలాంటిద‌ని ఇటీవ‌ల ప్రధాన మంత్రి అన్నారు. అందువల్ల ప్ర‌ధాని త‌న వైఖ‌రిలో కొన్ని మార్పులు చేసుకుంటార‌ని ఆశించ‌వ‌చ్చు. ఇంకా మూడేళ్లున్నందున‌... త్వ‌ర‌గానో లేక కాస్త ఆల‌స్యంగానే ఆయ‌న కొన్ని దిద్దుబాట్లు చేస్తార‌ని భావిద్దాం...!


మరింత సమాచారం తెలుసుకోండి: