తెలంగాణ ప్రజలకు కేసీఆర్ వరంగా ప్రకటించిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల వ్యవహారంపై సర్కారు శ్వేతపత్రం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం గాంధీభవనలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడానికి ఒకానొక కారణమైన ఈ హామీ విషయంలో ప్రభుత్వానికి స్పష్టత లేదన్నారు. జీహెచఎంసీ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పి, జీవో 53 ద్వారా ఏడెకరాలు అప్పగించారన్నారు.

 

అయినా పనులు ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదన్నారు. ఈ పథకం పేరుతో ప్రజల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయని, కానీ రాష్ట్రం ఏర్పడి రెండేళ్లు అయినా, టీఆర్ఎస్ అధికారంలోనే ఉన్నా ఇప్పటికీ దీనిపై తగిన విధాన నిర్ణయం ఏమీ తీసుకోలేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ 2015 దసరా రోజున 60వేల ఇళ్లకు శంకుస్థాపనలు చేశారని, వీటిని ఆరు నెలల్లో పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటికి వాటి పరిస్థితి తెలియడంలేదని ఆయన అన్నారు.


జీహెచఎంసీ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పి, జీవో 53 ద్వారా ఏడెకరాలు అప్పగించారన్నారు. అయినా పనులు ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదన్నారు. ఐడీహెచలో ఇళ్లు కట్టి వాటిని టూరిజంగా మార్చి ప్రజల్ని మోసం చేస్తున్నారన్నారు. ఐడీహెచ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన 14 మందికి ఇళ్లు కేటాయించారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షన తీసుకుంటున్న మరో వ్యక్తికి రెండు ఇళ్లు కేటాయించినట్లు ఆయన వివరించారు.

రాబోయే నాలుగేళ్లలో డబుల్ బెడ్రూం ఇళ్లే తమ ప్రాధాన్యమని మంత్రి కేటీఆర్ కూడా చెప్పారన్నారు. టాటా హౌసింగ్ సంస్థ ఈ ఇళ్లను కట్టేందుకు ఆసక్తి చూపినట్లు ఆయన తెలిపారని, ఆ సంగతి ఏమైందని ప్రశ్నించారు. అసలు మొత్తం ఎన్ని ఇళ్లు కడుతున్నారని, ఎప్పటికి పథకం పూర్తవుతుందని అడిగారు. ఐడీహెచ్ కాలనీలో వాళ్లు జి+2 పద్ధతిలో కట్టారని, ఇప్పుడు ఎలా కడతారని, దానికి ఎంత ఖర్చవుతుందని మర్రి శశిధర్ రెడ్డి నిలదీశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: