తమిళనాడు నుంచి ఏపీ అడవుల్లోని ఎర్ర చందనం దొంగతనానికి వచ్చే తమిళ స్మగ్లర్లు తెలివిమీరారు. పాత రూట్లలో వస్తే కనుక్కుంటున్నారని కొత్త రూట్లు వెదుక్కుంటున్నారు. పెద్దగా గస్తీ ఉండని ప్రాంతాలను ఎంపిక చేసుకుని.. వాటి ద్వారా శేషాచలం అడవుల్లోకి ఎంటరైపోతున్నారు. ఇప్పుడు తమిళనాడు ఎన్నికల హడావుడి ముగియడంతో ఈ ఎర్ర దొంగల జోరు బాగా పెరిగింది. 

నేరుగా శేషాచలం అడవుల్లోకి వస్తే దొరికిపోతున్నామని భావించిన తమిళ దొంగలు.. వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు. తిరుపతి- కడప మార్గంలో తనిఖీలు ముమ్మరం కావడంతో స్మగ్లర్లు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. తమిళనాడు నుంచి మదనపల్లి, కదిరి, పులివెందుల మీదుగా శేషాచలం అడవుల్లోకి చేరుకునే మార్గం ఉంది. ఈ మార్గాల్లో పోలీసుల, అటవీశాఖ అధికారులు దాడులు ముమ్మరంగా ఉండటంతో రూటు మార్చారు.

రూటు మార్చినా దొరికిపోయిన తమిళ దొంగలు.. 



పాత రహదారులను వదిలి కొత్తగా  సేలం నుంచి తిరుపతికి అక్కడ నుంచి అనంతపురం వీదుగా తాడిపత్రి చేరుకుంటున్నారు. కడప జిల్లాలోని ఎర్రగుంట్ల మీదుగా వస్తున్నట్లు పోలీసులు, అటవీశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మార్గంలో ఎటువంటి తనిఖీలు లేకపోవడం వారికి కలసివస్తోంది. తాజాగా తమిళనాడు నుంచి ప్రైవేటు బస్సులో కడప వైపు వస్తున్న బస్సును అధికారులు గుర్తించారు. 

అటవీశాఖ అదికారులు బస్సును గుర్తించిన విషయం తెలుసుకుని బస్సును వదిలి సుమారు 50 మంది కూలీలు...డ్రైవర్‌ అటవీప్రాంతంలోకి పారిపోయారు. బస్సుల వద్దకు చేరుకున్న అదికారులకు అందులో బియ్యం బస్తాలు...పప్పుదినుసులు... చెట్లు నరికే గోడ్డళ్లను స్వాధీనం చేసుకున అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. అడవుల్లోకి పారిపోయిన వారి కోసం టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలసి అటవీ అధికారులు కూబింగ్‌ నిర్వహిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: