ఏపీ సీఎం చంద్రబాబు బుధ, గురువారాల్లో కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. రాష్టవ్యాప్తంగా ఉన్న సమస్యల పరిష్కారంపై ప్రధానంగా దృష్టి సారించారు. ప్రగతిపథంలో రాష్ట్రాన్ని దూసుకెళ్లేలా చేసేందుకు ఏం చేయాలో కలెక్టర్లకు స్పీచులు దంచికొట్టారు. అంతవరకూ బాగానే ఉంది. చంద్రబాబుకు సాధారణంగా మీడియా కవరేజీపై ఆసక్తి ఎక్కువ. అందుకే దాదాపు ప్రతి ప్రోగ్రామ్ మీడియా కవరేజ్ ఉంటుంది. 

బుధవారం నాడు కూడా కలెక్టర్ల కాన్ఫరెన్సు లైవ్ కవరేజ్ ఇచ్చారు. ఐ అండ్ పీ ఆర్ ద్వారా ఏబీఎన్ ఛానల్ లైవ్ అన్ని ఛానళ్లకూ అందేలా చూశారు. దాంతో కలెక్టర్ల సదస్సు మీడియా కవరేజ్ బాగా వస్తుందని ఆశించారు. చాలావరకూ ఆ అంచనా నిజమే అయ్యింది. కానీ కలెక్టర్ల సదస్సు యాజ్ ఇట్ ఈజ్ గా లైవ్ టెలికాస్ట్ చేసేసరికి..అందులో చంద్రబాబు పిచ్చాపాటీగా మాట్లాడిన మాటలు వివాదాస్పదం అయ్యాయి. 

కలెక్టర్లతో ఇవేం మాటలు - వైసీపీ.. 




రాష్ట్రంలో భక్తి పెరిగిపోతోందని.. పాపం చేసినవాళ్లు గుళ్లకు ఎక్కువగా వెళ్తున్నారని.. ఎంత పాపం చేస్తే అంత ఎక్కువ కానుకలు సమర్పించుకుంటున్నారని.. చంద్రబాబు చెప్పిన మాటలు వివాదాస్పదం అయ్యాయి. ఇలాంటి మసాలా కోసం వేచి చూసే ప్రత్యర్థి మీడియా సాక్షి పండుగ చేసుకుంది. చంద్రబాబు కామెంట్లపై ఉతికి ఆరేసింది. ఆ తర్వాత సాయంత్రం వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ మీడియా సమావేశం నిర్వహించారు. 

కలెక్టర్లతో మాట్లాడే కబుర్లు ఇవేనా అంటూ ఆమె కూడా ఓ రేంజ్ లో చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. మొత్తం మీద ఇలా కలెక్టర్ల సదస్సు లైవ్ కూడా ప్రత్యర్థి మీడియాకు విమర్శించే అవకాశం ఇవ్వడంతో రెండో రోజు లైవ్ కవరేజ్ బంద్ చేసేశారు. అంతే కాదు.. కనీసం ఆ తర్వాత ఫుటేజ్ కూడా విడుదల చేయలేదు. సాక్షి దెబ్బకు చంద్రబాబు భయపడిపోయే కనీసం వీడియో ఫుటేజ్ కూడా ఇవ్వలేదని మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: