2019 నాటికి ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలన్నది జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్లాన్. ఆమేరకు ఆయన ఇప్పటికే అభిమానులకు క్లారిటీ ఇచ్చేశాడు. ఇంకా చాలా తక్కువ సినిమాల్లోనే నటిస్తానని చెప్పేశాడు. సినిమాలపై ఆసక్తి లేదని కూడా అనేక ఇంటర్వ్యూల్లో చెప్పాడు. ఐతే.. తాను ఇప్పటికే మాట ఇచ్చిన సినిమాలు.. తనను నమ్ముకుని నష్టపోయినవారి కోసం కొన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాడు పవన్. 

ఈ విషయంలో ఇప్పటివరకూ డైలమాలో ఉన్న పవన్ ఇప్పుడు ఓ క్లారిటీకి వచ్చాడని తెలుస్తోంది. చకచకా సినిమాల రూపకల్పన చేయాలని చూస్తున్నాడట. రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో వచ్చేలోగా వీలైనన్ని ఎక్కువ  సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నాడట. అందుకే ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో రెండు సినిమాలను లైన్లో పెట్టేశాడని చెబుతున్నారు. 

ఇక చకచకా పవన్ సినిమాలు.. 



ఇప్పటికే సర్దార్ గబ్బర్ సింగ్ ద్వారా నష్టాల్లో ఉన్న మిత్రుడు శరత్ మరార్ కోసం ఆయన నిర్మాతగానే ఎస్ జె సూర్య దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. గతంలో ఎస్ జే సూర్య ఖుషీలాంటి బంపర్ హిట్ ఇచ్చారు. మరోసారి అలాంటి మాయ చేయాలని ఈ త్రయం ప్లాన్ చేస్తోంది. ఈ సినిమా తర్వాత.. దాసరి నారాయణరావుకు ఇచ్చిన మాట ప్రకారం ఆయన నిర్మాణంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమాకు ఇప్పటికే ఓ కే చెప్పేశాడు. 

ఈ రెండు సినిమాల తర్వాత మూడో సినిమా హరీష్ శంకర్తో ఉంటుందట. దీన్ని ఎఎమ్ రత్నం బ్యానర్లో చేస్తాడట. ఇలా 2019 నాటికి మూడు, నాలుగు సినిమాలు పూర్తి చేయాలని పవన్ ప్లాన్ చేస్తున్నాడు. మరి ఇవన్నీ 2018లోపు పూర్తవుతాయా.. 2019 ఎన్నికలకు ప్రిపేరయ్యేందుకు తగిన సమయం లభిస్తుందా అన్నదే ప్రశ్న. తక్కువ సమయంతో ఎన్నికలముందుకు వచ్చి ఇబ్బందిపడతారా.. చూడాల్సిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: