తెలంగాణా ప్రభుత్వం అధికారం లోకి ఒచ్చిన చాలా కొద్ది కాలం లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే అప్పట్లో చాలా పెద్ద సంచలనం అయ్యింది గుర్తుందా ? స్కూళ్ళు, కాలేజీ లూ మొత్తం అన్నీ బంద్ చేసి మరీ ఎవరి ఊరికి వారిని వెళ్ళమని కోరి భారీగా రెండే రెండు రోజులలో నిర్వహించిన సర్వే మీద అప్పట్లో తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. అయినా అనుకున్నది సాధించడం లో దిట్ట అయిన కెసిఆర్ రెండే రెండు రోజులలో సమగ్ర కుటుంబ సర్వే వివరాలు మొత్తం తీసుకోవడం లో విజయవంతం అయ్యారు.

 

 పోలీసులనీ , అధికారుల్నీ , ప్రభుత్వ ఉద్యోగులనీ కలుపుకుంటూ వెళ్ళడం లో సక్సెస్ అయిన కెసిఆర్ దేశం లో ఎన్నడూ లేని విధంగా ఆగస్ట్ 19 2014 న దాదాపు కోటీ తొమ్మిది లక్షల మంది వివరాలను కేవలం నాలుగు లక్షల మంది ఉద్యోగుల సహాయం తో సేకరించారు. ఉదయం ఆరు గంటల కి మొదలైన ఈ సర్వ్ అప్పట్లో రాత్రి ఎనిమిది వరకూ సాగింది. కుటుంబం లో ఉండే అందరి సభ్యులపేరు , వారి వారి వయసు , విద్యార్హతల తో పాటు గా ఆధార్ వివరాలూ - బ్యాంక్ ఖాతా వివరాలూ , ఆస్తుల వివరాలూ అన్ని సేకరించారు.

 

తెలంగాణా కొత్తగా ఏర్పడిన తరవాత ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆర్ధిక, సామాజిక పరిస్థితి తెలుసుకోవడం కోసం చేసిన ఈ సర్వే రాష్ట్రానికి భవిష్యత్తు లో బంగారం లాగా ఉపయోగపడుతుంది అని కెసిఆర్ అప్పట్లో పేర్కొన్నారు. ఇంతకీ అప్పటి విషయం ఇప్పుడు ఎందుకు ప్రస్తావించాల్సి ఒచ్చింది అంటే ప్రస్తుతం ఈ సర్వే ఒక రికార్డ్ అయ్యింది. అవును లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ఈ సర్వే ని అతి పెద్ద జాతీయ రికార్డు గా నమోదు చేసింది. ఈ మేరకు ఆ సంస్థ ఎడిటర్ విజయ్ తెలంగాణా ప్రభుత్వానికి ధృవీకరణ పత్రం కూడా పంపించడం విశేషం.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: