మహానాడు వేదికగా ఏపీలో ప్రముఖ పార్టీల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. తెలుగు దేశం పార్టీ వేదిక అయిన మహా నాడు లో ప్రారంభోపన్యాసం చేసిన చంద్రబాబు ప్రతిపక్షనేత వైఎస్ జగన్ టార్గెట్ గా తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్ జగన్ ది అడుగడుగునా హింసా సంస్కృతి అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఘాటు పదజాలంతో విమర్శలు గుప్పించారు.  

తునిలో రైలును కాల్చేసిన కాపుల ఉద్యమంలో హింసకు వైసీపీ అధినేత జగనే కారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరోక్షంగా కామెంట్ చేశారు. తునిలో కాపుల ఉద్యమం నాడు అరాచకం సృష్టించారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలో అలాంటి అశాంతి ఉండదని ఆయన గుర్తు చేశారు. 

జగన్ ది హింసారాజకీయం  బాబు..




ఏపీలో ఇలాంటి హింస చేసేది ఒక్క వైఎస్సార్ కుటుంబం, వై.ఎస్.జగన్ మాత్రమేనంటున్నారు చంద్రబాబు. అంతే కాదు.. పరిటాల రవీంద్ర హత్య జరిగినప్పుడు కూడా శాసనసభలో ఈ విషయం చెప్పానని అన్నారు. అనంతపురం జిల్లాలో సూట్ కేస్ బాంబు పెట్టిన చరిత్ర కూడా జగన్ దేనని చంద్రబాబు ఆరోపించారు. ఐతే.. కడప జిల్లా అంతటా ఈ సంస్కృతి లేదని, వైఎస్ కుటుంబంలోనే ఉందని అన్నారు.

తునిలో ఘటనకు వైసీపీయే కారణమని టీడీపీ చెప్పడం ఇదే మొదలు కాదు.. కానీ ఆ ఘటన జరిగి నాలుగు నెలలు కావస్తున్నా.. ఇంతవరకూ ఒక్క వైసీపీ నేతనూ అరెస్టు చేయలేదు. ఒక్క ఆరోపణా రుజువు చేయలేదు. ఆధారాలు లేకుండా మీడియా వార్తలు రాయకూడదని నీతులు చెప్పే నేతలు ఇలా ప్రతిపక్షనేతపై మాత్రం నేరుగా విమర్శలు చేయవచ్చా అని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు.



మరింత సమాచారం తెలుసుకోండి: