మహానాడు వేదికగా ప్రతిపక్షనేత వైఎస్ కుటుంబంపై సీఎం చేసిన విమర్శలపై వైసీపీ ఘాటుగా స్పందించింది. పరిటాల రవి ఇంట్లో సూట్ కేసు బాంబు పెట్టించింది జగనే అని చంద్రబాబు విమర్శించడాన్ని వైసీపీ తప్పుబట్టింది. మహానాడు వేదికపై వైయస్‌ఆర్, పరిటాల కుటుంబాల మధ్య చిట్టుపెట్టి ఆ మంటల్లో చలికాచుకునేందుకు చంద్రబాబు యత్నిస్తున్నాడని ఆ పార్టీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. 

సూటికేసు బాంబుతో వైయస్‌ జగన్‌ పరిటాల రవీంద్రను చంపడానికి ప్రయత్నించాడని చెప్పడం బాబు కుట్రపూరిత చర్య అని పేర్కొన్నారు. అప్పటి ప్రతిపక్షనేత వైయస్‌ రాజశేఖరరెడ్డి తన కుమారుడు తప్పు చేస్తే ఉరితీయడానికైనా సిద్ధపడతాను అంటూ వెంటనే సీబీఐ విచారణ వేయమని చెప్పిన మాటలు మర్చిపోయావా అని చంద్రబాబును నిలదీశారు. 

పరిటాల హంతకులను కౌగిలించుకుంది చంద్రబాబే- భూమన




పరిటాల రవి రాజకీయ ఎదుగుదలను అడ్డుకుందే చంద్రబాబు అని భూమన గుర్తు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్‌ పరిటాల రవిని ఆదరించి మంత్రిపదవి ఇస్తే చంద్రబాబు అది ఓర్వలేక రవి రాజకీయ భవిష్యత్తును సమాధి చేశారని చెప్పారు. వైయస్‌ఆర్‌ కుటుంబానికి, పరిటాల కుటుంబానికి ఎలాంటి కష్టాలు లేవని భూమన అంటున్నారు. 

వై.ఎస్. రాజారెడ్డి మరణిస్తే పరిటాల వచ్చి ఘనంగా నివాళులర్పించారని, సంక్షోభంలో ఉన్న రవిని వైయస్‌ రాజారెడ్డి అనంతపురం వెళ్లి  పరామర్శించి వచ్చారని భమన అంటున్నారు. అలాంటి సన్నిహిత కుటుంబాల మధ్య చంద్రబాబు మహానాడు వేదికగా చిచ్చుపెట్టాలనుకుంటున్నాడని మండిపడ్డారు. పరిటాల రవి హత్య కేసులో నిందితులు జేసీ దివాకర్‌రెడ్డిని, మిగతా వారందరినీ హక్కున చేర్చుకుంది నీవు కాదా అని చంద్రబాబును భూమన ప్రశ్నించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: