చంద్రబాబు విజయవాడలో లేరు. తిరుపతిలో మహానాడు కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఐనా సరే విజయవాడలో కీలక నిర్ణయం జరిగిపోయింది. ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు 27 మంది అఖిల భారత స్థాయి అధికారుల బదిలీల నిర్ణయం జరిగిపోయింది. ఐతే.. ఈ బదిలీల నిర్ణయంపై అంతకుముందే చంద్రబాబు నిర్ణయం తీసుకుని ఉంటారని.. ఉత్తర్వులు ఇప్పుడు వెలువడి ఉంటాయని భావించొచ్చు. 

ఏపీలో 27మంది అఖిలభారత సర్వీసు అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇందులో 19మంది ఐఏఎస్ అధికారులతోపాటు ఒక ఐఆర్ఎస్, ముగ్గురు ఐఎఫ్ఎస్ అధికారులు ఉన్నారు. వీరితో పాటు ఇతర వివిధ సర్వీసులకు చెందిన వారున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సచివాలయంలో కీలకమైన శాఖతోపాటు జలవనరుల శాఖ కార్యదర్శులను ప్రభుత్వం మార్చింది.

భారీ స్థాయిలో బదిలీలు.. 



ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శిగా అజేయ కల్లం నియమితులయ్యారు. ప్రభుత్వ రంగ సంస్థల విభాగానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అశ్వినీకుమార్ ఫరీదా బదిలీ అయ్యారు. దినేష్ కుమార్ ను గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ తోపాటు గృహనిర్మాణ శాఖకు ప్రత్యేక ప్రధానకార్యదర్శిగా బదిలీ చేసింది. పీవీ రమేష్ ను అటవీ, పర్యావరణశాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. 

జేసీ శర్మకు ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ రాజకీయ ముఖ్య కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. సుదీర్ఘకాలంగా జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాధ్ దాస్ ను పాఠశాల విద్యా శాఖకు ప్రభుత్వం బదిలీ చేసింది. అల్పసంఖ్యాక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శిగా డాక్టర్ విజయ్ కుమార్ ను నియమించింది. ఆర్పీ సిసోసియాను గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగాను, నైపుణ్యాల అభివృద్ధి ముఖ్య కార్యదర్శిగానూ బాధ్యతలు అప్పగించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: