ప్రతిపక్ష నేత అంటే ప్రజల పక్షాన పోరాడాలి. ప్రజా సమస్యలపై ఎలుగెత్తాలి. వారికి న్యాయం జరిగేలా చూడాలి. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టాలి. నిజమే.. కానీ అలాగని ప్రతీదాన్ని రాజకీయం చేసినా ఇబ్బందే. ఈ పార్టీ ఇంతే ఏం చేసినా విమర్శిస్తారు.. ఈ విమర్శలకు అర్థం ఉండదు అన్న ముద్ర వేయించుకుంటే.. మంచి విషయంపై పోరాడినా ఆ కీర్తి దక్కదు. 

ప్రస్తుతం జగన్ విషయంలో అదే జరుగుతోందా అనిపిస్తోంది. ఎందుకంటే ఆయన శుక్రవారం గుంటూరు జిల్లా పెదగొట్టిపాడులో పర్యటించారు. ఇటీవల గుంటూరులోని లక్ష్మీపురంలో మట్టి పెళ్లలు విరిగిపడి ఏడుగురు భవన నిర్మాణ కార్మికులు మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబాలను ఆదుకోవటంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. 

జగన్ .. కాస్త ఆగొచ్చు కదా.. 




భవన ప్రమాదం జరిగిన తీరును కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కార్మికుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరచిపోయిందని జగన్ విమర్శించారు. ప్రభుత్వ సహాయం కేవలం 5 లక్షల రూపాయలు మాత్రమే మంజూరు చేసిందని.. కార్మిక శాఖ నుంచి బీమా రూపంలో 13 లక్షల రూపాయలు వచ్చాయని తెలిపారు. కేవలం బిల్డర్ నుంచి రెండు లక్షల రూపాయలు మాత్రమే నష్టపరిహారం ప్రభుత్వం ఇప్పించిందని ఆరోపించారు. 

ప్రభుత్వం బిల్డర్ పట్ల కొమ్ము కాస్తోందని అధికారాన్ని చేతిలో పట్టుకొని కార్మికులకు అన్యాయం చేస్తోందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే గుంటూరు కలెక్టరేట్ వద్ద తానే స్వయంగా ధర్నా నిర్వహిస్తానని హెచ్చరించారు. ఐతే.. ఈ భవన ప్రమాద విషయంలో ప్రభుత్వం వేగంగానే స్పందించింది. 

దుర్ఘటన జరిగిన 24 గంటల్లోపే పరిహారం సొమ్ము 10 లక్షల రూపాయల సొమ్ము.. మరో పది లక్షల చెక్కు బాధితుల కుటుంబాలకు అందాయి. ఇక భూమి, ఉద్యోగం వంటి నిదానంగా వస్తాయి. ఇంతలో సర్కారు ఏమీ చేయలేదని విమర్శించడం తొందరపాటు అవుతుందేమో..!?



మరింత సమాచారం తెలుసుకోండి: