సాధారణంగా ఎవరికైనా ఫోటోలు అనగా మహా ఆనందంగా ఉంటుంది..రక రకాల భంగిమల్లో ఫోటోలు దిగుతూ వారి ఆనందం వ్యక్తం చేస్తుంటారు. అప్పట్లో ఫోటో దిగాలంటే కెమెరాల చాలా హంగూ ఆర్భాటాలు ఉండేవి..కానీ టెక్నాలజీ మారుతున్నా కొద్ది ఎన్నో మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా సెల్ ఫోన్ లో ఫోటో తీయడం మొదలు పెట్టినప్పటి నుంచి కెమెరాలకు అటకలెక్కాయి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వచ్చాక సెల్పీల పిచ్చి మొదలైంది. తమకు నచ్చిన వారితో నచ్చిన ప్రదేశాలు ఎక్కడికైనా టూర్ వెళ్లినా అక్కడి ప్రదేశాల్లో ఎవరి సహాయం లేకుండా తమకు తామే ఫోటో తీసుకునే సౌలభ్యం వచ్చినప్పటి నుంచి ఫోటో దిగడం స్టైలే మారిపోయింది. ఇక సెల్పీలతో చాలా ప్రమాదాలు కొని తెచ్చుకున్న వారూ లేకపోలేదు.

రైల్వే ట్రాక్ పై సెల్ఫీ


అవును మరి కొందరి సెల్ఫీల చేష్టలు శృతి మించి రాగాన పడుతున్నాయి. స్మార్ట్ ఫోన్ లు అందరి చేతుల్లోకి వచ్చేయడం, అలా ఫోటో దిగి ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేయడం చేసేస్తున్నారు. రక రకాల ఫీట్స్ చేస్తూ సాహసాలు చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తూ సెల్ఫీలు తీసుకోవడం బాగా అలవాటైంది. తాజాగా కొంతమంది ఆకతాయిలు పిచ్చిముదిరిన సెల్ఫీలు తీసుకోవాలని జైలు పాలయ్యారు..అంతే కాదు సెల్ఫీలు తీసుకుంటే జైలుకెళ్లిన మొదటి సెల్ఫీరాయుళ్లు కూడా వీరే కావడం విశేషం.


వచ్చే రైల్ ముందు పిచ్చి సాహసాలు


వివరాల్లోకి వెళితే.  యూపీలోని ఫిరోజాబాద్ జిల్లాలో చోటు చేసుకుందీ ఘటన! వారంతా 13-16 ఏళ్ల పిల్లలే. యమా స్పీడుతో రైలు వస్తుండగా అత్యంత ప్రమాదకర స్థితిలో ఎన్నోసార్లు సెల్ఫీలు దిగారు కూడా. కానీ, పట్నా-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ ఎదుట సెల్ఫీ దిగాలనే పిచ్చి కోరికతో తుండ్లా-ఎట్మద్పూర్ వద్ద పెద్దపెద్ద రాళ్లు, చెట్టుకొమ్మలు వేసి ట్రాక్ను బ్లాక్ చేశారు. అదృష్టవశాత్తు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి ఎమెర్జెన్సీ బ్రేక్ వేయడంతో ప్రమాదం తప్పింది. ఆర్పీఎఫ్ సిబ్బందికివారు టీనేజర్లను అరెస్టు చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: