ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ఎపీని ఎక్కువగా కాంగ్రెస్ ప్రభుత్వమే పరిపాలించేది. ఆ తర్వాత కాంగ్రెస్ పాలనపట్ల ప్రజలకు తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. అప్పుడు సినిమా ఇండస్ట్రీలో నందమూరి తారక రామారావు గారు సినిమాల్లో అగ్ర హీరోగా రాణిస్తున్న రోజులవి. ఆయన తీసిన కొన్ని రాజకీయ కోణంలోని చిత్రాలు తెలుగు ప్రజల ఆధారాభిమానల్ని గెల్చుకున్నాయి. అప్పుడు ఎన్టీఆర్ ఆంధ్ర ప్రజల హృదయాల్లో ఆయన చెరగని ముద్ర వేసుకున్నారు.


అప్పుడు రాజీవ్ గాంధీ ప్రధానిగా కొనసాగుతున్న కాలం. తీవ్ర కరువుతో, అనేక సమస్యలతో సతమతమవుతున్న రోజులవి. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో మరో ప్రత్యామ్నాయ పార్టీని నెలకొల్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజల సమస్యలను, వారి ఆశయాలను నేరవార్చాలనే ఆలోచన ఎన్టీఆర్ కు వచ్చింది. అప్పుడు తెలుగు ప్రజల ఆధారాభిమానల్ని చూరగొన్న ఎన్టీఆర్ 29 మార్చ్ 1982 లో తెలుగుదేశం పార్టీని స్థాపించి సామాన్యుడి వాహనం అయిన సైకిల్ ని ఆయన పార్టీ ఎన్నికల గుర్తుగా ఎంచుకున్నారు.


ఆతర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై పోరాటానికి సై అని, మీ సమస్యలు పరిష్కారం కావాలంటే, మీరు సుఖ సంతోషాలతో జీవితం గడపాలంటే, మన రాష్ట్రాన్ని మనమే పాలించుకోవాలనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల్లో విజయ దుందుభి మోగించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అప్పుడు అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ ఆంధ్ర ప్రజల గుండెల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో కుడా చెరగని ముద్ర వేసుకొని మరో రాజకీయ చరిత్రను సృష్టించారు. కేంద్రం సైతం ఆయన ఘన విజయాన్ని చూసి నివ్వెరపోయింది.


కాని రాజకీయం అంటేనే స్వార్థం, కుళ్లు, కుతంత్రం కొద్దికాలంలోనే ఆయన పార్టీలో ముసలం పుట్టుకుంది. రాజకీయ నేతల మధ్య వైరాన్ని ఆయన సక్రమంగా పరిష్కరించేలేకపోయారు. ఆయనను అనారోగ్యం సైతం వెంటాడేది. ఆయన చికిత్స నిమిత్తం అమెరికా వెళితే ఇక్కడ రాజకీయాల్లో పెను మార్పులే సంభవించాయి. పార్టీ చెయ్యు దాటే పరిస్థితికి వచ్చింది. అయితే ఆ సమయంలోనే చంద్రబాబు రాజకీయ అరంగేట్రం చేశారు. కారణాలు ఏవైనా, ఎన్టీఆర్ స్థానాన్ని ఆయన ఆక్రమించారు. ఎన్టీర్ ను చంద్రబాబే చంపించారనే ఆరోపణలు ఆయన ఎదుర్కొన్నారు. ఇందులో ఉన్న వాస్తవం ఎంతో తెలియదుగాని అప్పుడే నందమూరి వంశంలో చీలికలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ తనయుడు చంద్రబాబు కు మధ్య వైరం పెరిగింది.

ఏది ఏమైనప్పటికీ ఎన్టీఆర్ అటు సినిమాల్లో అందగాడిగా, ఇటూ రాజకీయాల్లో ఎదురులేని నాయకుడిగా పేరు తెచ్చుకున్నారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు...!!


మరింత సమాచారం తెలుసుకోండి: