తెలుగువారి గొప్పతనం చాటి చెప్పిన మహానుభావులు స్వర్గీయ నందమూరి తారక రామారావుని స్మరించుకుంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతిలో సాగుతున్న మహానాడు రెండవ రోజు కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజలే దేవుళ్లని ఎన్టీఆర్‌ చెప్పారని, పేదరికంలేని సమాజ స్థాపనే ఎన్టీఆర్‌ నినాదమని సమ సమాజ నిర్మాణమే ఆయన ధ్యేయమని అందుకోసం నిరంతరం తెలుగు దేశం పార్టీ శ్రమిస్తుందని అన్నారు. 'ఉన్నతమైన ఆశయాల కోసం శ్రమించిన వ్యక్తి ఎన్టీఆర్'అని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

తెలుగు జాతికి ఎన్టీఆర్‌ ఆరాధ్య దైవమని, ఉన్నతమైన ఆశయాల కోసం జీవించిన వ్యక్తి ఎన్టీఆర్‌ అనికొనియాడారు. తెలుగు దేశం పార్టీ స్థాపించి తెలుగు వారి గౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన మహానుభావులు అని అన్నారు.  తెలుగు జాతికి ప్రతీక వున్న ఎన్టీఆర్ అని, తెలుగువారి ఆత్మగౌరవ స్ఫూర్తి పేరుతో చరిత్రలో నిలిచిపోయే ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

మహానాడులో మాట్లాడుతున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు


కొత్త రాజధాని అమరావతిలోనే దాదాపు 115.5 అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తామని ప్రకటించారు బాబు. దీంతో అక్కడకు వచ్చిన టీడీపీ కార్యకర్తలు, నాయకులు హర్షధ్వానాలు చేశారు. అంతే కాదు ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా 'అన్న'గారి పేరుతో మున్ముందు మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని కూడా ఈ సందర్భంగా కొనియాడారు చంద్రబాబునాయుడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: