నాయకులంతా అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా లేనప్పుడు మరో విదంగా మారుతూ ఉంటారనేది మనందరికీ విదితమే. ప్రజలు కట్టబెట్టిన ఐదు సంవత్సరాల పదవీకాలాన్ని జీవితాంతం గుర్తుండే విధంగా గడపడం కూడా మన రాజకీయ నాయకులకు అలవాటే. ఇలాంటి పదవులూ మళ్లీ వస్తాయో రావో, ఉన్నప్పుడే లైఫ్ ని ఎంజాయ్ చేయాలనే సామెత రాజకీయ నాయకులకు సరిగా సరిపోతుంది.


ప్రజలు అధికారాన్ని కట్టబెట్టకముందు వారి ఆస్తులు, బంగ్లాలు, కార్లు మాములుగానే ఉంటె, ఒక్కసారి అధికారంలోకి వస్తే చాలు ఒక్కసారే ఇవన్నీ మారిపోతాయి. కోట్లు ఖరీదు చేసే బంగ్లాలు, కార్లలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు మన నాయకులు. ఇక మన నాయకులు వాడే కార్ల విషయానికి వస్తే మాత్రం ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. కాకపోతే అన్నీ ఖరీదైన కార్లే. మన లోక్ సభ స్పీకర్ కుడా ఇటీవల ఖరీదైన ఖారును కొనుగోలు చేసారట. ఆ కారు ధర 48.25 లక్షలు.


అంత ఖరీదైన కారు కొనడం పట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. స్పీకర్‌కు లగ్జరీ కారు అవసరమా అంటూ కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. స్పీకర్ సుమిత్రా దీనిపై ఓ నిర్ణయాన్ని వెల్లడించాలని కాంగ్రెస్ నేత మనీష్ తివారి అన్నారు. అయితే సెక్యూర్టీ కారణాలను దృష్టిలో పెట్టుకుని జాగ్వార్ కారును కొనుగోలు చేసినట్లు లోకసభ అధికారులు పేర్కొన్నారు. సుమారు 4-5 కార్ల గురించి సమీక్షించామని, అయితే అందులో భద్రతా కారణాల దృష్ట్యా జాగ్వార్‌ను కొన్నట్లు లోకసభ కార్యదర్శి డీ.భల్లా తెలిపారు. సెక్యూర్టీ అధికారులు ఇచ్చిన సలహా మేరకే జాగ్వార్‌ను కొన్నట్లు ఆయన స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: