తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలకు కొత్త వన్నె తెచ్చిన మహానటులు రాజకీయ వేత్త మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు. తెలుగు ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హీరోగా వెలిగిపోతున్న సమయంలో తెలుగు వారి గౌరవాన్ని నలుదిశలా చాటి చెప్పాలని ‘తెలుగు దేశం’ పార్టీ స్థాపించి అప్పటి వరకు ఓటమి ఎరుగని కాంగ్రెస్ పార్టీపై అఖండ విజయం సాధించి తెలుగోడి సత్తా చాటారు. ఎన్టీఆర్ రాజకీయాల్లో ఎన్నో మార్పులు తీసుకు వచ్చి పేదవారికి మేలు కలిగే ఎన్నో ప్రణాళికలు, అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

మహానాడులో మాట్లాడుతున్న ఎపీ మురళీ మోహన్


అప్పటి వరకు రాజకీయాలంటే పట్టణ ప్రాంతాల వారికే తెలుసు..అలాంటిది పల్లె పల్లెనా రాజకీయాలంటే ఏమిటో తెలియజేసేలా చేశారు. పల్లె ప్రాంతాలన్నీ చుట్టి వస్తూ తెలుగు దేశాన్ని రాష్ట్రవ్యాప్తంగా తెలిసేలా చేశారు. ఎన్టీఆర్ అంటే గొప్ప నటులే కాదు గొప్ప రాజకీయ వేత్త అని ప్రజలకు తెలిసేలా చేశారు. కరువు కాలంలో ప్రజలకు అండగా నిలిచి విరాళాల కోసం జోలె పట్టి రోడ్డు పైకి వచ్చారు. చిన్నా పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరికి సమన్యాయం అనే నినాదంతో ప్రజల మన్ననలు పొందారు.

మహానాడుకి విచ్చేసిన టీటీడీపీ నాయకులు


అలాంటి ఉన్నతమైన వ్యక్తి గురించి తిరుపతిలో జరుగుతున్న టీడీపీ వార్షిక వేడుక 'మహానాడు' లో  ఆయనతో ఎన్నో చిత్రాల్లో నటించిన వ్యక్తి పార్లమెంటు సభ్యుడు మాగంటి మురళీమోహన్ సరికొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. మహానటులు, దివంగత సీఎం నందమూరి తారకరామారావు పుట్టి పెరిగింది కృష్ణా జిల్లా అలాంటి ఈ జిల్లాకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టాలని డిమాండ్ చేశారుకృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని మురళీమోహన్ అనగానే పార్టీ నేతలు హర్షాతిరేకం వ్యక్తం చేస్తూ మద్దతు పలికారు. అంతే కాకుండా ఎన్టీఆర్ కి రాష్ట్రపతి అవార్డు కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: