అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్  ట్రంప్ ఎన్నికల ప్రచార సభల వద్ద ఆందోళనకారుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. మొదటి నుంచీ ట్రంప్ పై నిరసన వ్యక్తమవుతున్నా..ఇటీవల ఆయన విజయావకాశాలు పెరగడంతో నిరసనలూ పెరిగాయి. దీనికి తోడు ట్రంప్ మద్దతుదారులు కూడా రెచ్చిపోతుండటంతో పరిస్థితి అదుపుతప్పుతోంది. 

తాజాగా శాన్ డియాగోలో ఇదే జరిగింది. ఇక్కడ ట్రంప్  సభ ముగిసిన తర్వాత ఆయన ఆయన వ్యతిరేకులు పెద్ద స్థాయిలో ఆందోళన చేపట్టారు. మెక్సికో జెండాలు, ప్లకార్డులు పట్టుకుని ట్రంప్ కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినదించారు. నిరసనకారుల ఘర్షణ పడడం..దీన్ని మద్దతుదారులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతకు, అరెస్టులకు దారితీసింది. 

ట్రంప్ సభలో నిత్యం ఆందోళనలు.. 



ట్రంప్  అభిమానులు కూడా రెచ్చిపోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. రెండు వర్గాలు దాడులకు దిగాయి. అందుబాటులో ఉన్న వస్తువులు విసురుకోవడంతో ఘర్షణ ఉగ్రరూపం దాల్చింది. చివరకు పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులు పెప్పర్  స్ప్రే ప్రయోగించాల్సి వచ్చింది. ఆందోళనకారుల్లో కొందరిని అరెస్టు చేశారు. మరికొందరిని చెదరగొట్టారు. 

ట్రంప్ ఎన్నికల సభల వద్ద ఇలాంటి దృశ్యాలు నిత్యకృత్యంగా మారాయి. ఇటీవలి కాలంలో కేవలం మూడు రోజుల్లోనే రెండు చోట్ల ఈ స్థాయి ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మొన్నటికి మొన్న న్యూ మెక్సికోలోనూ ఇలాంటి ఉద్రిక్తతే  చెలరేగింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: