తెలుగు దేశం మహానాడు సభ తిరుపతి లో అట్టహాసం గా సాగుతోంది. తెలుగు దేశం తమ్ముళ్ళు అందరూ ఈ పండగ కోసం ప్రతీ ఏడాదీ ఎదురు చూడగా ఈ ఏడాది తమ పండగ రానే వచ్చేసింది అని హ్యాపీగా ఉన్నారు. అయితే ఈ సభ లో ఇప్పటి వరకూ సాగిన ప్రసంగాలలో ఆ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ప్రసంగం తెలుగు దేశం నాయకులని కదిలించింది అంటున్నారు. ఆయన ఆవేదన తో చాలా పెద్ద స్పీచ్ ని ఇచ్చారు పార్టీ జనాలకి. ఆయన మాట్లాడిన మాటలలో అర్ధం చూస్తే పార్టీ తనని సరిగ్గా పట్టించుకోవడం లేదు అనే భావన బయటకి కనపడింది. సీనియర్ ఎన్టీఆర్ పార్టీ మొదలు పెట్టిన దగ్గర నుంచీ తాను ఏ రకంగా కష్టపడ్డాను , ఎన్టీఆర్ నుంచి తనకి ఎలాంటి ప్రోత్సాహం వచ్చింది అనేది మోత్కుపల్లి వివరిస్తూ రావడం ఆశ్చర్యపరిచింది.

 

 

తనకి ఆరోగ్యం బాలేదు అని ఎన్నాళ్ళు బతికి ఉంటానో చెప్పలేను అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. " తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ నాకు ఆప్త మిత్రుడు కానీ తెలుగు దేశం పార్టీ కోసం , మన పార్టీ భవిష్యత్తు కోసం నేను మొదటి నుంచీ అతనితో యుద్ధం చేస్తూ ఒస్తున్నాను, నేను ఏ రాష్ట్రం వాడిని అనుకుంటే ఆ రాష్ట్రం వాడిని అవుతాను. నన్ను మీరు ఆంధ్రా వాడు అంటే ఆంద్రా వాడిని , తెలంగాణా వాడు అంటే తెలంగాణా వాడినే  " అని చెప్పుకొచ్చారు మోత్కుపల్లి. రాజకీయ విశ్లేషకులు మోత్కుపల్లి మాటలని అనలైజ్ చేసి చెబుతోంది ఏంటంటే ఎప్పటి నుంచో ఆయనకీ రావాల్సిన గవర్నర్ గిరి విషయం లో తీవ్ర నిరాశ లో ఆయన క్రుంగిపోతున్నారు అని.

 

గండిపేట లో జరిగిన మహానాడు లో చంద్రబాబు స్వయంగా మోత్కుపల్లి ని గవర్నర్గారు అని సంభోధించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి కూడా, దాంతో ఆయన భవిష్యత్తు మీద రకరకాల ఊహాగానాలు ఒచ్చాయి. మీడియా కూడా ఈ విషయం మీద కన్ఫర్మేషన్ లేకుండా న్యూస్ లు , స్టొరీ బోర్డ్ లు రాసి పడేసింది. కానీ చంద్రబాబు ఆ విషయం అస్సలు పట్టించుకునట్టు ఎక్కడా కనపడలేదు. నెమ్మదిగా గవర్నర్ గిరి మీద ఆశలు వదిలేసుకున్న మోత్కుపల్లి , రాజ్యసభ సీటు మీద కన్ను వేసారు. "నేను  జీవితాంతం పార్టీ కి పని చేసాను , నేను మీ వాడిని - మీలో ఒకడిని " అంటూ మోత్కుపల్లి స్వయంగా స్టేజీ మీద పదే పదే చెప్పడం చూస్తుంటే చంద్రబాబు కి ఆయన ఎదో చెప్పాలని అనుకుంటున్నారు అనే విషయం స్పష్టం అవుతోంది. ఆంధ్రా కోటాలో అయినా ఆయన్ని రాజ్యసభ కి చంద్రబాబు పంపిస్తే బాగుంటుంది అని పార్టీ శ్రేణులు కూడా అంటున్నాయి మరి.

 

 

 

 

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: