మన పురాణాలు అయిన రామాయణం, మహాభారతంలో ఎన్నో సంఘటనలు చాలా వింతగానూ ఆలోచించే విధంగానూ ఉంటాయి...అయితే అప్పట్లో రాచరికానికి సంబంధించిన విషయాలు. ముఖ్యంగా కౌరవులు రాజ్యాన్ని పొందాలనే దురాశతో పాండవుల సోదరుడైన దర్మరాజును జూదానికి పురిగొలుపుతారు. జూదమంటే పడిచచ్చే ధర్మరాజు రాజ్యాన్ని తన అన్నదమ్ములను చివరకు తన ధర్మపత్ని అయిన ద్రౌపతిని కూడా జూదంలో ఓడిపోతారు. ఆ సమయంలో అందరి ముందు ద్రౌపతికి అవమానం జరుగుతుంటే కృష్ణుడు కాపాడుతాడు. కానీ అచ్చూ ఇలాంటి కథనే నిజంగా ఈ కలియుగంలో జరిగింది.  

ఒక వ్యక్తి జూదంలో తన బార్యను ఓడిపోయిన ఘటనపై ప్రసార మాద్యమాలలో విస్తారంగా వార్తలు వస్తున్నాయి. క్రికెట్ బెట్టింగ్ లో ఈ ప్రభుద్దుడు భార్యను పందెంగా పెట్టాడట. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ వద్ద రవీందర్ సింగ్ క్రికెట్ అంటే మహా పిచ్చి..క్రికెట్ టోర్నమెంట్స్ జరుతున్న సమయంలో బెట్టింగ్ పెట్టడం అలవాటైన మనోడికి ఇప్పుడు ఐపిఎల్ మ్యాచ్ లపై బెట్టింగ్ పెట్టడం ఆరంభించాడు..ఈ వ్యసనం కాస్త డబ్బులు పోయాక,భార్య జస్మిత్ కౌర్ ను పందెంగా కాశాడట.

ఆ బెట్టింగ్ లో కూడా ఓడిపోయాడు.దాంతో ఆమెను గెలిచిన పందెం రాయళ్లు ఆమెను వేధించడం మొదలు పెట్టారు.ఆమెను వారికి కట్టెబెట్టడానికి భర్త కూడా సిద్దం అయ్యాడు. ఈ సమయంలో ఆమెకు అండగా  జస్మీత్ సామాజిక కార్యకర్తలు నిలిచారు. రవిందర్ పై పోలీసు కేసు పెట్టారు. .తన నగలు కూడా భర్త అమ్మేశాడని, మద్యం, గ్యాంబ్లింగ్ కు అలవాటు పడి ,చివరికి తనను కూడా పందెంగా పెట్టాడని ఆమె వాపోయింది.పోలీసులు భర్తతో సహా పందెం రాయళ్లపై కేసు నమోదు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: