ఆడాళ్లంటే కాస్త సున్నితంగా వ్యవహరిస్తారని అనుకుంటాం.. ఇంట్లో సంగతి ఎలా ఉన్నా.. నలుగురిలో కాస్త పద్దతిగా ఉంటారనుకుంటాం.. ఎట్ లీస్ట్ మగాళ్లతో పోలిస్తేనైనా కాస్త బూతులు, తిట్లు తక్కువ ఉంటాయని ఆశిస్తాం.. కానీ అలాంటిదేమీ లేదట. ఆడాళ్లు కూడా బాగానే రెచ్చిపోతున్నారట. ప్రత్యేకించి సోషల్ మీడియా వేదికల్లో అసభ్యకర పోస్టులకు ఏమాత్రం వెనుకాడటం లేదట. 

సోషల్ మీడియాలో పురుషులు మాత్రమే అసభ్యకర పదాలు పోస్టు చేస్తారని సాధారణగా అనుకుంటారు. కానీ మహిళలు కూడా సాటి మహిళలపై సెక్సీయెస్ట్ కామెంట్స్ చేస్తున్నారట. ట్విట్టర్‌లో దాదాపు సగంమంది మహిళలు ఇలాంటి భాషను ఉపయోగిస్తున్నారని ఓ అధ్యయనంలో తేలింది. డెమోస్‌ అనే బ్రిటీష్ సంస్థ జరిపిన పరిశోధనలో ఈ వాస్తవం వెలుగు చూసింది. 

ఆడాళ్లూ నెట్లో బూతులు తిడుతున్నారట.. 



డెమోస్ సంస్థ.. దాదాపు మూడు వారాలపాటు బ్రిటన్‌ లోని  ట్విట్టర్‌ యూజర్ల పోస్టులను విశ్లేషించిందట. ప్రత్యేకించి పురుషులు, మహిళలు చేస్తున్న స్త్రీ ద్వేష పూరిత వ్యాఖ్యలను అధ్యయనం చేసిందట. స్త్రీలను దూషించే పదాలను ఎంత తరచూగా ట్విట్టర్‌ యూజర్లు వాడుతున్నారనే అంశాన్ని పరిశీలించిందట. ఈ అధ్యయనంలో ఆసక్తికరమై ఫలితాలు వెలుగు చూశాయి.

సగటున రెండు లక్షల ట్వీట్లలో స్త్రీలను దూషించే అభ్యంతకర పదాలు వెలువడుతున్నాయని డెమోస్ పరిశోధనలో తేలింది. ఇవి వెలువడిన వెంటనే దాదాపు 80 వేల మందికి చేరుతున్నాయని గుర్తించిందిట. ఈ పరిస్థితి బాధిత మహిళలు ఎదుర్కొంటున్న మానసిక క్షోభకు అద్దం పడుతున్నదని పరిశోధకులు అంటున్నారు. అదీ సంగతి. 



మరింత సమాచారం తెలుసుకోండి: