పెద్ద పెద్ద నగరాల్లో ప్రజలకు ఎంట్రటైన్ మెంట్ చేయడానికి ఎక్కడో ఉన్న కృర మృగాలను, సాదు జంతువులను, వివిధ రకాల పక్షులను, జలచర జీవాలను జూ లో పెడుతుంటారు. ఇక జూల్లో ఇలాంటి జీవరాశులను చూసి చాలా మంది సంతోష పడుతుంటారు..చిన్న పిల్లలు తెగ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఒక్కోసారి జూ లో జరిగే సంఘటనలు చూస్తుంటే ఒక్కసారే షాక్ కి గురౌతుంటాం..కొంత మంది ఆకతాయిలు జూలో ఉండే కృర జంతువులతో వెకిలి చేష్టలు చేయబోయి ప్రమాదాలకు గురి అవుతుంటారు. ఆ మద్య ఢిల్లీలో ఒక యువకుడు పులి జోన్ లోకి వెళ్లి అన్యాయంగా చనిపోయాడు..మొన్నటి మొన్న హైదరాబాద్ నెహ్రూజూలాజికల్ పార్క్ లో సింహాల వద్దకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇవ్వాలనుకున్నాడు..కానీ అదృష్టం బాగుండి బతికి బయట పడ్డాడు.  

ఓహియోలోని సిన్సినాటి జూలో ఓ దారుణం జరిగింది.  ఓ 4 ఏళ్ల చిన్నారి ప్రమాద వశాత్తు సుమారు 12 అడుగుల లోతున్న గొరిల్లాల ఎన్క్లోజర్లో పడ్డాడు. దీంతో ఆ కుటుం సభ్యులు ఖంగారు పడి జూ సిబ్బందికి తెలియజేశారు. అయితే ఆ సమయంలో అక్కడ  మూడు గొరిల్లాలు ఉన్నాయని, వీటిలో రెండు ఆ బాలుడికి దూరంగా వెళ్లిపోగా, హరాంబే అనే 17 ఏళ్ళ వయసున్న గొరిల్లా ఆ చిన్నారిని ఆట బొమ్మలా ఆడుకుంది.

నీటిలో అటూ ఇటూ తిప్పుతూ విసిరేసింది దీంతో ఆ చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో ఆ చిన్నారిని రక్షించేందుకు  హరాంబేను సిబ్బంది కాల్చి చంపారు.గాయపడిన చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. ఈ వీడియో జూ అధికారులు విడుదల చేశారు. గొరిల్లా బాలుడి పట్ల క్రూరంగా ప్రవర్తించిన దృశ్యాలను డిలిట్ చేసినట్టు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: