ఎన్టీఆర్.. తెలుగు జాతి గర్వించే నటుడు.. అంతేనా.. సామాన్యుడి చెంతకు రాజకీయాన్ని తెచ్చిన నాయకుడు.. ఎందరో నాయకులకు నాయకత్వ భిక్ష పెట్టినవాడు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విశేషణాలు.. మరి అలాంటి మహానుభావుడి చివరిరోజులు మాత్రం అత్యంత దుర్భరంగా గడచిన మాట వాస్తవం. అకస్మాత్తుగా ఆయన పరమపదించడం కూడా అప్పట్లో తెలుగువారికి షాక్..

మరి ఎన్టీఆర్ ఎలా చనిపోయారు. ఆయన అనారోగ్యానికి కారణం ఏంటి.. భార్య లక్ష్మీపార్వతే ఎన్టీఆర్ మరణానికి కారణమని అప్పట్లో చంద్రబాబు వర్గం ప్రచారం చేసింది. కానీ ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబే కారణమంటున్నారు లక్ష్మీ పార్వతి.. ఆయన జయంతి సందర్భంగా ఓ పత్రికలో రాసిన వ్యాసంలో ఆమె ఓ  సంచలన విషయం బయటపెట్టారు.. .  

ఆమె కథనం ప్రకారం.. 1995 ఆగస్ట్ 27న ఎన్టీఆర్‌ను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా తొలగించి, చంద్రబాబు తననుతాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. ఇదేం న్యాయ మని అడగటానికి వెళ్లిన ఎన్టీఆర్ మీద చెప్పులేసి అవమానించారు. ప్రత్యేక విమానంలో స్పీకరు యనమలను రప్పించి ఫోర్జరీ సంతకాలతో బలపరీక్ష చేయించి గవర్నరుకు పంపారట. ఆ రోజే ఎన్టీఆర్ కంటతడి పెట్టి ‘నేను ఈ రోజే మరణించాను’ అని ఆవేదనతో చెప్పారట. 
 
బ్యాంకు అకౌంట్ స్తంభింపజేసినందుకేనా ఎన్టీఆర్ కు గుండెపోటు.. 



పదవి పోగొట్టుకుని అనారోగ్యంతోపాటు, అవమానంతో రగిలిపోతూ ఎన్టీఆర్.. చంద్రబాబుమీద యుద్ధం ప్రకటించారు. అతని దుర్మార్గాలను, అవినీతిని ‘జామాతా దశమగ్రహం - జెమినీ టీవీలో ధర్మపీఠం’ కార్యక్రమం ద్వారా ఎలుగెత్తి చాటారు. చివరకు ప్రజల్లోకెళ్లి ఇతని ఆకృత్యాలను చెప్ప టానికి విజయవాడలో దేవినేని నెహ్రూ ద్వారా బహిరంగ సభకు సిద్ధమయ్యారట.

ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు జనవరి 17, 1996న ఎన్టీఆర్ ఖాతా ఉన్న ‘బ్యాంక్ ఆఫ్ బరోడా’ మీద స్టే ఆర్డరు తెచ్చి ఖాతాను స్తంభింప చేశారట. ఆ హఠాత్మపరిణామంతో ఎన్టీఆర్ ఎంతో క్షోభ చెందారట. ఆ వేదనతోనే తెల్లవారు జామున గుండెపోటుకు గురై ఎన్టీఆర్ మరణించారు. వాస్తవం ఇలా ఉంటే.. బాబు పత్రికలు అదంతా ఆయన భార్యవల్లనే అని చాటింపు చేశాయని లక్మీపార్వతి అంటున్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: