ప్రస్తుత  రాజకీయాల్లో లొకెష్  ఒక చర్చనీయాంశం గా మారి  పోయారు. కారణం చంద్రబాబు తన కుమారుణ్ణి ప్రజల ముందు ఒక మెధావిగా ప్రత్యేకతలు కలిగినమేదోసంపత్తి ఉన్న వ్యక్తిగా ప్రవేశపెట్టాలనే ఆత్రుత గమనించే వాళ్ళకి కొంత ఆశ్చర్యం  వింత, విసుగు కలిగిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు 60 దాటిన చంద్రబాబు లో చాదస్తం పాళ్ళు బాగా పెరిగి పోయాయి.  సాధారణంగా ఈ వయసు లో అది అందరికీ తప్పదు.  కీర్తి కాంక్ష అధికంగా ఉండేవాళ్ళలో ఈ నిష్పత్తి బహు విచిత్రం గా మారిపోతుంది.


కార్నెజీమేలన్ యునివర్సిటి లో ఎం.ఐ.ఎస్.(మానేజ్మెంట్ ఇంఫర్మేషన్ సిష్టంస్) గ్రాడ్యుఏషన్ చేసి, స్టాన్-ఫొర్డ్ యూనివర్సిటి లో ఎం.బి.ఏ చేసిన వ్యక్తి, అందునా అపర చాణక్యుడని రాజకీయనాయకుల్లో కొనియాడబడుతున్న లోకేష్ స్తాండార్డ్ లెవెల్స్ ఇంత తక్కువగా ఉన్నాయేమిటీ అని కొద్ది విజ్ఞానమున్న వాళ్ళకే అనిపిస్తుంటే బాబు మారీ ఎక్కువగా పొగిడేయటం నవ్వుతెప్పిస్తుంది జనానికి.

 

తల్లి-దండ్రులు తమ సంతానాన్ని పొగిడితే వాళ్ళకు ఆయుక్షీణం అంటారు. సాధారణంగా తెలుగువాళ్ళు తమ పిల్లలను పదుగురులో అసలు పొగడరు. కాని బాబు కీర్తి కాంక్ష ఉచితానుచితాలను మరిచిపోతుంది. "ముఖ్యమంత్రి కొడుకు పంది పిల్లైనా పెళ్ళి చేసుకుంటాను అంటుంది లీడర్ సినిమాలో ఒక కథానాయిక"  ముఖ్య మంత్రి, అదీ అటు రాష్ట్రములో, ఇటు కేంద్రంలో చక్రం తిప్పిన వారు, ప్రధాని పదవికే ప్రపోజ్ చేయబడ్డ అపరచాణక్యుని కుమారునికి  జనం నీరాజనాలు పట్టటం సహజం, బెల్లం ఉన్నచోటికే చీమలు, అధికారం ఉన్న చోటికే ఆశ్రితులు రావటం సహజాతి సహజం.


చంద్రబాబు-లోకేష్ వ్యూహరచనల్లో 

 

ఆశ్రితులు కనక బాబు దృష్టికి ఈ విపరీత పోకడలను తీసుకు రాలేక పోవచ్చు. కానీ సాధారణ  ప్రజల్లో విద్యావంతులకు ముప్పైమూడేళ్ళ వయసున్న అదీ  విశ్వవిఖ్యాత స్టాన్-ఫొర్డ్ బిజినెస్ స్కూల్లో మానేజ్మెంట్ చదివిన వ్యక్తి స్టాండర్ద్స్ ఎంతలా  ఉంటాయో, లోకేష్ స్టాండర్డ్ ఏమిటో ఆయనగారి ఉపన్యాసములోనే తేలిపోతుంది. ఆయన ఉపన్యాసం లో జగన్ ను విమర్శించటం పరమ జుగుప్సాకరంగా ఉంటుంది. లోకెష్ లెక్కలో జగన్ విలువ తక్కువనిపిస్తే అతనిని పూర్తిగా విస్మరిస్తే సరిపోతుంది. మరీ బోండా ఉమ, రావెల కిషొర్, అచ్చెన్నాయుడు లాగా నాటు మాటలెందుకు. బహుముఖ ప్రజ్ఞా వంతులు మాట్లాడితే ఉపన్యాసానికి అద్భుతమైన శోభ వస్తుంది. మనవాడు, తెలివితేటలతో స్టాన్-ఫొర్ద్ లో చదవలేదని, దేశంలోనే ఇంఫర్మేషన్ టెక్నాలజీ ని మలుపులు తిప్పి, కొన్ని వేలమందికి ఉద్యోగావ కాశాలిచ్చి ఎవరో చేయించిన స్కాములో ఇరుక్కొని మరుగున పడ్డ ఒక దురదృష్టవంతుడైన వ్యక్తి  (దయతో) ఖర్చుతో చదువు కు(కొ)న్నారని ప్రజల్లో ఒక ప్రచారముంది.  అది నిజం కాదనుకోనివ్వని ఈయన తెలివితేటలు,  ఉపన్యాసములో కనిపించటంతో ప్రజలు  అది నిజమేనేమో ననిపిస్తుందని  శ్రోతలు అనుకుంటున్నారు. 


మొన్న మహానాడులో చంద్రబాబు కు మన లోకేష్ బాబు సలహాలు ఇవ్వటం, తను పాటించటం  వలననే తన రాజకీయ జీవితం ఎంతో సాఫీగా సాగిందని, ఆయన విదేశాల్లో ఉండి సలహా ఇచ్చే సమయం దొరకక పోవటం వలననే మద్యలో రెండు టెర్ము లు పదవి కోల్పోయినట్లు చెప్పితే, అక్కడ శ్రొతల చెవుల్లో కాలిఫ్లవర్లు మొలి చాయట. వాటిని తీయించుకోవటానికి ఆసుపతృల చుట్టూతిరిగారట జనంలోని ఆశ్రితులు మరి వాళ్ళలోని శ్రోతలు.

 

అలాగే గతములో లొకేష్ ఇచ్చిన ఒక సలహా గురించి ప్రచారముండేది అదే "నగదు బదిలీ పదకం". దానిని పదకం అంటారా ఎవరైనా? ప్రజలకు ప్రభుత్వం చేసే సంక్షేమంకు సంభందించిన చెల్లింపులను "చెల్లించే విధానం" మాత్రమే. చెల్లింపులు, అవినీతి అధికారులు, ఉద్యోగుల పాలు కాకుండా లభ్దిదారుని ఖాతాలోకి జమ చేసే విధానం. ఈ సలహా బాంకుల్లో పని చేసే ప్యూను కూడా చెప్పగలడు. అప్పుడు దీనికి బాబు ఇచ్చిన ప్రచారం,  "పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడు పుట్టదు మరి జనులా పుత్రుని కనుగొని పొగడగ ...." అన్నట్లు సారు ఫీలై పోయారు. 

తన తరం నాయకులతో 


పువ్వు పుట్టగనే పరిమళిస్తుందన్న సామెతను గుర్తుచేసారు బాబు. పదవ తరగతి చదివే రోజుల్లోనే లోకెష్, ప్రధాని పదవి జ్యోతిబసు లాంటి మేధావులను కాదని తనని వరిస్తున్న సమయములో ఈ తాత్కాలిక ప్రధాని పదవి తీసుకోవద్దని తనను హెచ్చరించారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవే సురక్షితమని ఉద్భొదించారట. ఈ విషయాలను మూడురోజులు జరిగిన మహానాడులో బాబు గారు టిడిపి కార్యకర్తలకు పిట్టకతల్లా మధ్య మధ్య వినిపించారు. ఒక వర్గం టీడిపి నాయకులు లోకేష్ కు ఇంకా పెద్ద బాధ్యలను ఇవ్వాలని, అదీ దిల్లీ లో ఏపి ని ప్రతిబింబించే పదవికాని, రాష్ట్రములో అతిముఖ్యమైన మంత్రిపదవి గాని ఇవ్వాలని వత్తిడి పెంచారు. ఇప్పుడు లోకెష్ తెలుగు దేశం కేంద్ర కార్యదర్శి బాధ్యతలు విజయంతంగా నిర్వహిస్తున్నారు. ఆయన చొరవతోనే తెలంగాణా లో తెలుగు దేశం పార్టీ కన్సాలిడేట్ అయింది. అలాగే ఆంధ్రప్రదేస్ లో ప్రతిపక్షాన్ని కన్సాలిడేట్ చేస్తుందని ఉవాచ.

“లోకేష్ విషయం పూర్తిగా వంశానికి మరియు వారసత్వానికి సంబందించింది కాదని, ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా అత్యుత్తమంగా పనిచేస్తూ వివిద పార్టి కాడర్లను సమర్ధవంగా నడిపిస్తున్నట్లు”  టిడిపి ఎం.పి గల్లా జయదేవ్ చెప్పారు,  ఆయన గల్లా  అరుణ కుమారి గారి తనయుడు, తెలుగు సినిమా సూపర్-స్టార్ కృష్ణ  గారి అల్లుడు,  మరో సూపర్-స్టార్ మహెష్ బాబుగారి బావగారని మనవి.  వీరూ వారసత్వం  కాకుండా తమ విద్వత్తు తోనే రాజకీయాల్లో,  ప్రజాసేవలో ఎదిగిపోయి,  రాష్ట్ర కీర్తి చంద్రికలను విశ్వవ్యాప్తం చేస్తున్నారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: