సాధారణంగా ఉన్నత పదవుల్లో ఉన్నవారికి చాలా ఎక్కువ మందితో పరిచాయలుంటాయి. మాములుగా ఒక పార్టీ కార్యకర్త నుండి పార్టీ అధ్యక్షుడు,  రాష్ట్ర ముఖ్యమంత్రి ఎదిగినప్పుడు పార్టీ కార్యకర్తలు ఎందరికో ఆయన తెలిసి ఉంటారు. పైగా చిన్నప్పుడు చదువుకున్నప్పటి మిత్రులు, ఉన్నత విద్యా సమయంలోని మిత్రులు ఇలా చాలామందే ఆయనకి తెలిసి ఉంటారు. మాములుగా అయితే అలాంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే వీరితో ఉన్న సంబంధాలను మర్చిపోవడమే కాకుండా, ఒకవేళ దగ్గరికి వెళ్లినా ఎవరో తెలిసినా తెలియనట్లు నటించడం సహజం. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం అలా చేయలేదు.

 

పార్టీ మొదట్లో కాస్త సీరియస్ గా ఉన్న బాబు ప్రవర్తనలో కొద్దిగా మార్పులను మనం గమనించవచ్చు. వయసు పెరుగుతున్న కొద్దీ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు... పాత జ్ఞాపకాలను, చిన్ననాటి సంగతులను నెమరువేసుకోవడం క్రమంగా పెరుగుతోంది. గతంలో ఎన్నడూ తన కాన్వాయ్ ని చంద్రబాబు ఆపిన సందర్భాలు దాదాపుగా లేవనే చెప్పాలి. మొన్నామధ్య హైదరాబాదులోని తన ఇంటి నుంచి శంషాబాదు ఎయిర్ పోర్టుకు బయలుదేరిన చంద్రబాబు... పార్టీ సీనియర్ కార్యకర్తను చూసి నడిరోడ్డుపై కాన్వాయ్ ని ఆపేసిన సంగతి తెలిసిందే.


తాజాగా నిన్న ఉదయం తన సొంతూరు నారావారిపల్లె నుంచి మహానాడు వేడుకలో పాలుపంచుకునేందుకు తిరుపతికి బయలుదేరిన సందర్భంగా తన చిన్ననాటి మిత్రుడిని చూసి రోడ్డుపైనే తన కాన్వాయ్ ని ఆపేశారు. రోడ్డుకు ఓ పక్కగా నిలిచిన తన బాల్య స్నేహితుడు, టీడీపీ కార్యకర్త గిరిధర్ రెడ్డిని చూసిన చంద్రబాబు తన కారును ఆపి ఆయనను తన వద్దకు పిలిచారు. గిరిధర్ రెడ్డిని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న తర్వాత చంద్రబాబు అక్కడి నుంచి బయలుదేరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: