ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజు రోజుకీ గరం గరంగా ఉంటున్నాయి. ముఖ్యంగా ఏపీలో ప్రతిపక్ష హోదాలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరూ టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. మరోవైపు వైసీపీ అధినేత వైఎస్ జగన పార్టీ ఫిరాయింపు దారులపై కఠిన చర్యలు తీసుకోవాలని గగ్గోలు పెడుతున్నారు. అంతే కాదు వైఎస్ జగన్ అధికార పార్టీలో ఉన్న చంద్రబాబు తమ పార్టీ సభ్యులను ప్రలోభ పెట్టి డబ్బులు ఎరగా చూపించి ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపిస్తున్నారు.

తాజాగా వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వచ్చామన్న కారణంతో తమపై ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, అతని అనుచరులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నేత జలీల్ ఖాన్ విమర్శించారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన వైఎస్ జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమకు 30 కోట్ల రూపాయల చొప్పున ఇచ్చారని ఆరోపిస్తున్నారని అన్నారు.

నిజానికి చంద్రబాబు తమకు 30 పైసలు కూడా ఇవ్వలేదని ఆయన చెప్పారు. అంతేందుకు నేనే చంద్రబాబు నాయుడికి లక్ష రూపాయలు ఇచ్చానని అన్నారు..అంటే ఆయనకు కాదు పార్టీ ఫండ్ గా ఇచ్చానని ఆయన చెప్పారు. మహానడు కోసం చంద్రబాబు పడుతున్న కష్టం తాపత్రయం చూసి లక్షరూపాయలు పార్టీకి విరాళంగా ఇచ్చానని ఆయన చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: