భారత దేశంలో రోజూ మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి..అయితే ఎక్కడ కూడా ఇలాంటి కామాంధులపై కఠిన చర్యలు తీసుకునన్న దాఖలాలు లేవు..అందుకూ ప్రతిరోజూ ఎక్కడో అక్కడ ఇలాంటి వారు రెచ్చిపోతూనే ఉన్నారు. మహిళలపై అత్యారాచం చేసే కామాంధులకు అరబ్ దేశాల్లో అత్యంత దారుణంగా శిక్షలు విధిస్తారు అందుకే అక్కడ మహిళలంటే చాలా గౌరవం..కానీ మన దేశంలో మహిళలంటే గౌరవం ఇస్తూనే మరో పక్క వారి మాన ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొందరు దుర్మార్గులు. తాజాగా పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో దారుణం చోటుచేసుకుంది. 20 ఏళ్ల యువతిని నలుగురు వ్యక్తులు కిడ్నాప్‌ చేసి.. నడుస్తున్న కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

కోల్‌కతా శివార్లలోని సాల్ట్‌ లేక్‌ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో అల్పాహారం కోసం బయటకు వచ్చిన యువతిని నలుగురు యువకులు కిడ్నాప్‌ చేసి మూడు గంటల పాటు ఏకధాటిగా ఓ అమ్మాయిపై సామూహిక అత్యాచారం జరిగింది. కోల్‌కతా విమానాశ్రయానికి కిలోమీటరు దూరంలో ఉన్న వీఐపీ రో డ్డులో గల ఓ బారులో ఆమె పాటలు పాడుతుంది. నగరానికి కొత్త కావడంతో దారి అడుగుతుండగా ఒక వ్యక్తి సాయం చేస్తానంటూ ముందుకొచ్చాడు. కానీ అతడు ఆమెను తప్పుదోవ పట్టించాడు. ఆమె నడుస్తుండగా అతడు ఫోన్లో ఎవరితోనో మాట్లాడాడు.

కాసేపటి తర్వాత ఉన్నట్టుండి ఓ కారు ఆమె ముందుకు వచ్చింది. తర్వాత అక్కడకు నలుగురు వ్యక్తులు బలవంతంగా కారులోకి లాక్కున్నారని, అందులో తనకు దారి చూపిన వ్యక్తి కూడా ఉన్నాడని యువతి పోలీసులకు వివరించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: