తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుగులేని పార్టీగా ఆవిర్భవించిన తెలుగుదేశంపార్టీ ఆనాడు పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్షంగా సైతం వ్యవహరించిన విషయం అందరికీ విదితమే. అప్పుడే పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించాలని అన్నగారు ఆకాక్షించారు. ఆ తర్వాత పార్టీ రాష్ట్ర, జాతీయ స్థాయిలో పట్టును కోల్పోవడం, ఆతర్వాత చంద్రబాబు పార్టీ పగ్గాలు చేపట్టడం లాంటివి జరిగాయి.

 

ఆ తర్వాత టీడీపీ పార్టీ 1994 నుండి అధికారంలోకి రావడంతో చంద్రబాబు పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించాలని స్సంకల్పించి ఆయన తనకు తానుగా టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పేరుపెట్టుకున్నారు. ఆయన తనయుడు లోకేష్ ను సైతం టీడీపీ జాతీయ కార్యదర్శిగా నియమించారు. అయితే ఇక్కడ ఉన్న అసలు విషయం ఏంటంటే, భారత ఎన్నికల సంఘం మాత్రం పార్టీని జాతీయ పార్టీగా మాత్రం ప్రకటించలేదు.

 

నిజానికి ఒక ప్రాంతీయ పార్టీకి జాతీయ పార్టీ గుర్తింపు దక్కాలంటే రెండు రాష్ట్రాల్లో కలిసి 18 మంది ఎంపీలు ఉండాలి. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం మూడు రాష్ట్రాల్లో 11 మంది ఎంపీలు (లోక్‌సభ సభ్యుల సంఖ్యలో 2 శాతం) ఉన్న పార్టీని జాతీయ పార్టీగా గుర్తిస్తారు. దక్షిణ భారతదేశంలో టీడీపీకి మాత్రమే జాతీయ పార్టీగా రూపొందే అవకాశాలున్నాయి. 

 

ప్రస్తుతం టీడీపీ కి జాతీయ స్థాయి పార్టీ గా పెరుగాంచడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో  ఒక్క ఎంపీ సీటు టీడీపీ కైవసం చేసుకున్నా జాతీయ పార్టీగా టీడీపీ అవతరించడం ఖాయమని పార్టీ వర్గాలు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో ఎంపీలను కలిగి ఉండే స్థాయికి తెలుగుదేశం చేరుకుంటుంది. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్నారు. తెలంగాణలో బలమైన ప్రతిపక్షంగా ఉంది. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో జరిగిన ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్ధులు గెలుపొందారు. కర్ణాటక, ఒడిసా, తమిళనాడుల్లో కూడా పార్టీని విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: